Home / Entertainment / అమెరికా అబ్బాయిగా వరుణ్, తెలంగాణా అమ్మాయిగా సాయి పల్లవి.

అమెరికా అబ్బాయిగా వరుణ్, తెలంగాణా అమ్మాయిగా సాయి పల్లవి.

Author:

వరుణ్ తేజ్ చేసింది మూడు సినిమాలు మాత్రమే అయిన తన యాక్టింగ్ తో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు, కెరీర్ మెదట్లోనే కంచె లాంటి మంచి సినిమా చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు, అభిమానులతో ముద్దుగా మెగా ప్రిన్స్ అని కూడా పిలిపించుకుంటూన్నాడు, లోఫర్ సినిమా తరువాత కొంచెం గ్యాప్ తీసుకోని ఇప్పుడు రెండు సినిమాలలో నటించబోతున్నాడు, శ్రీను వైట్ల డైరెక్షన్ లో ఒక సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది, ఇప్పుడు శేఖర్ ఖమ్ముల దర్శకత్వంలో మరో సినిమాలో నటించబోతున్నాడు, ఈ సినిమాలో హీరోయిన్ గా మలయాళం ముద్దుగుమ్మ ‘సాయి పల్లవి’ ని తీసుకున్నారు , మలయాళంలో గతేడాది వచ్చిన బ్లాక్ బ్లాస్టర్ సినిమా ‘ప్రేమమ్’ లో సాయి పల్లవి హీరోయిన్. మలయాళంలో సాయి పల్లవి చేసిన పాత్రలన్నీ కూడా చాలా బలమైనవే. ఆమె సినిమాలన్నీ కంటెంట్ ఓరియెంటెడ్ గా నడిచేవే. ఇప్పటిదాకా ఆమె రెగ్యులర్ కమర్షియల్ సినిమాలేమీ ఆమె చేయలేదు. అలాంటి సినిమాలు పల్లవికి సూటయ్యే అవకాశాలు కూడా లేవు. ఐతే శేఖర్ కమ్ముల ఆనంద్.. గోదావరి లాంటి సినిమాల గురించి తెలుసుకుని.. అతను చెప్పిన పాత్ర నచ్చి ఆమె ఓకే చేసిందట.

Varun-Tej-To-Romance-Sai-Pallavi

ఈ సినిమా అమెరిక అబ్బాయి , తెలంగాణ అమ్మాయిల మధ్య జరిగే ఒక అందమైన లవ్ స్టోరి అని ఇప్పటికే మనకి తెలుసు. ప్రస్తుతం వరుణ్ తేజ శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న సినిమాలో నటిస్తున్నాడు ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసి వచ్చే నెలలో ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని స్టార్ట్ చేసి ఆగస్టు చివరికి పూర్తి చేసుకుని, రెండవ షెడ్యూల్ ని అక్టోబర్ లో పూర్తి చేస్తారు, మెదటి షెడ్యుల్ లో తెలంగాణాకి సంభందించిన పార్ట్ షూట్ చేసి, రెండవ షెడ్యుల్ ని అమెరికాలో పూర్తి చేస్తారు, ఈ చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్టు  దిల్ రాజు తెలిపాడు.

(Visited 590 times, 1 visits today)