Home / Entertainment / సమంత ఇంకా ఎదగలేదన్న మహేష్

సమంత ఇంకా ఎదగలేదన్న మహేష్

Author:

సమంత ఇంకా చిన్న పిల్ల ముందు ఆలోచించకుండా ఏదో అనేసి తర్వాత భాద పడుతుంది. తన పై నాకే కోపమూ లెదు అన్నరు మహేష్ బాబు. కొంత కాలంగా సమంత కీ మహేష్ కీ మధ్య కోల్డ్ వార్ నడుస్తొందని వచ్చిన వార్తలకి మహేష్ పై విధంగా స్పందించారు. రీసెంట్ గా ఓ ఇంగ్లీష్ దిన పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన మహేష్ శ్రీమంతుడు విశేషాలను షేర్ చేసుకుంటూ సమంత గురించి కూడా ఎవరు ఊహించని కామెంట్స్ చేశాడు. కొంతకాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న మహేష్ శ్రీమంతుడు హిట్ తో కాస ఊపిరి పీల్చుకున్నట్టే అనిపిస్తోంది. వరుసగా రెండు ఫ్లాపులతో నెర్వస్ గా ఉన్న మహేష్. మొదట శ్రీమంతుడు కి డివైడ్ టాక్ రావటం తో కస్త కంగారు పడినా, నెమ్మదిగా పునంజుకుని బాహుబలి తర్వాత అంతటి హిత్ సాధించిన సినిమాగా శ్రీమంతుడు నిలబడటంతో మళ్ళీ ఫుల్ జోష్ లోకి వచ్చేసాడు. ఈ సంవత్సరం లో వచ్చిన సినిమాల్లో శ్రీమంతుడు సినిమా కలెక్షన్లు నాన్ బాహుబలి రికార్డులన్ని చెరిపేసింది. ఒక రకంగా చెప్పాలంటే శ్రీమంతుడు ట్రెమండస్ హిట్ సాదించినట్టు. కాని బాహుబలి మేనియాలో ఈ సినిమా ఎంత హిట్ అయ్యిందనేది కానరాలేదు గానీ సైలెంట్ గా మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు మహేష్.

సినిమా ప్రమోషన్ కోసం మీడియలో ఇంటర్వ్యూ లు ఇస్తూనే ఉన్నాడు. అయితే వన్ సినిమా టైంలో సమంత ఆ సినిమా పోస్టర్ గురించి కామెంట్ చేసింది కదా దానిపై మీ స్పందన ఏంటని రిపోర్టర్ అడిగిన క్వశ్చన్ కి మహేష్ సమాధానమిస్తూ “సమంత ది చిన్న పిల్ల మనస్థత్వం. ఆమె సందర్భాన్ని బట్టి ఆ టైంలో ఏదనిపిస్తే అది అనేస్తుంది తర్వాత బాధపడుతుందని అన్నాడు మహేష్.” వన్ సినిమా పోస్టర్ గురించి సమంత ట్విట్టర్లో పెట్టిన కామెంట్ రచ్చ రచ్చ అయ్యింది. అయితే అది ఆమె కావాలని చేయలేదని వెనుకేసుకుని వచ్చాడు మహేష్. దూకుడు సినిమాలో మహేష్  తో కలిసి పని చేసినా తర్వాత వచ్చిన నెంబర్ వన్ రిలీజ్ కు ముందు “పోస్టర్లు మరీ అనాగ రికంగా ఉన్నాయి” ఇదేం సినిమా. అని ట్విట్టెర్ లో కామెంట్ చేసింది సమంతా. అప్పట్లో మహేష్ సమంతల మధ్య మంచి వార్ నడుస్తోందని కూడా గాసిప్పులు వచ్చాయ్. ఇప్పటికి కూడా మహేష్ అభిమానులు సమంత మీద కోపంగానే ఉన్నారు. ఐతే ఇప్పుడు తనకు సమంత పై ఎలాంటి కోపమూ లేదనీ తాను అసలు అలాంటివి పెద్దగా పట్టించు కోనూ అంతూ చెప్పుకొచ్చి, తాను వివాదాలకు ఎంత దూరంగా ఉండాలనుకుంటాడో మరో సారి చెప్పకనే చెప్పేసాడు.  సడెన్ గా మహేష్ సమంత గురించి ఇంత పాజిటివ్ గా మాట్లాడటం చూసి అందరు షాక్ అవుతున్నారు.  కాని మహేష్ సమంత గురించి చిన్న పిల్ల లాంటిదని చెప్పి నిజంగానే అందరికి షాక్ ఇచ్చాడు. మహేష్ ఇలా హుందాగా వ్యవహరించటం పై అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్స్ మంచి మనసునుని అభినందిస్తున్నారు. మరి సమంత తన తప్పు తెలుసుకుంటుందా అనేది చూడాలి.

(Visited 76 times, 1 visits today)