త్రివిక్రమ్ శ్రీనివాస్ నితిన్ ల కాంబినేషన్ లో రాబోతున్న కొత్త సినిమా ‘అ ఆ’ (అనసూయా రామలింగం వర్సెస్ ఆనంద విహారి) అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక పూర్తి అయింది. ఈసినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈసినిమాలో హీరోయిన్ గా సమంతతో పాటు ప్రస్తుతం మళయాల సినిమా రంగాన్ని తన ‘ప్రేమమ్’ సినిమాతో ఒక కుదుపు కుదిపిన 19 ఏళ్ల క్యూట్
బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ ను ఈ ‘అ ఆ’ సినిమా కోసం త్రివిక్రమ్ రంగంలోకి దింపడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తే సమంతాకు మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట.
ఇప్పటికే టాలీవుడ్ కు కేరళ నుండి అనేకమంది హీరోయిన్స్ రావటం కొత్తేమీ కాదు. సమంతా కూడా మళయాళీ అమ్మాయే. ఐతే ఈ సినిమాకు త్రివిక్రమ్ ఈ కొత్త మల్లు బ్యూటీ ని తన సినిమాకు ఎన్నుకోవడం వెనుక మరొక కారణం కూడ ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. సమంతా మేయిన్ రోల్ గా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాగా త్రివిక్రమ్ తీస్తున్న ‘అ ఆ’ సినిమాలో సమంత విషయంలో గ్లామర్ కన్నా నటనకు
ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో హీరో పాత్రను పోషిస్తున్న నితిన్ సమంతను ప్రేమిస్తూ ఉంటే అనుపమా పరమేశ్వరన్ మాత్రం నితిన్ వెంట పడుతుందట. నటన విషయంలో సమంతను గ్లామర్ విషయంలో అనుపమను నూ ఎక్స్ పోజ్ చేస్తూ ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ‘అ ఆ’ రూపొందుతుంది అని తెలుస్తోంది. యంగ్ హీరోయిన్స్ చాలామంది రావటంతో సమంతకు గ్లామర్ విషయంలో యూత్ లో క్రేజ్ తగ్గినట్టే ఉంది . కొత్త అందాల కోసం చూస్తున్న యూత్ ని ఆకట్టుకోవడానికి త్రివిక్రమ్ చాల వ్యూహాత్మకంగా అనుపమని ఈ సినిమాకు ఎంపిక చేసాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఎక్కడ తాను వెనకబడిపోతానేమో అని సమంతా ఆందోళన గా ఉందట. ఒక పక్క త్రివిక్రం సినిమా లో చాన్స్ అంటే కెరీర్ కి ప్లస్సే అయినా తాను ఫ్యామిలీ టైపులో ఉంటూ మరో పిల్ల అందాలని చూపిస్తే ఇన ప్రేక్షకులు తననేం చూస్తారని వాపోతోందట.
ఐతే సమంతా ఇంత భాధ లో ఉండగా త్రివిక్రమ్ మూవీలో ఛాన్స్ వస్తే ఆ హీరోయిన్స్ కెరియర్ కు తిరుగులేదు అనే సెంటిమెంట్ ఉండటంతో అనుపమ త్రివిక్రమ్ సినిమాలో ఎంపిక అయినందుకు పిచ్చ ఆనందంగా ఉందట. అంతే కాదు అనుపమ సెలెక్ట్ అయిన వార్త బయటకు రాగానే టాలీవుడ్ కు చెందిన చాలామంది దర్శక నిర్మాతల దృష్టి అప్పుడే ఈ యూత్ కలల రాణి పై పండినదని వార్తలు వస్తున్నాయి.
తనకు అప్పుడే టాలీవుడ్ లో వస్తున్న ఈ స్పందనకి అనుపమ కూడా ఎక్సయిట్ అవుతోందట. అయితే ఈ చిత్రం రిలీజ్ అయ్యే వరకు వేరే సినిమాలు ఒప్పుకోకూడదని త్రివిక్రం ఒక షరతు విధించాడట. దాంతో ఇంకా ఎవరికీ ఓకే చెప్పట్లేదట ఈ కొత్త బ్యూటీ. ఈవార్తలు అప్పుడే సమంత దృష్టి వరకు వెళ్ళడంతో అనుపమకు టాలీవుడ్ మీడియాలో వస్తున్న క్రేజ్ ను చూసిన సమంత ఇంకా తెగ బాదపడిపోతొందట. అదన్న మాట సంగతి సమంత కష్టాలు సమంతవి.