Home / Inspiring Stories / శాంసంగ్ ఫోన్లు పేలుతున్నాయి..! జాగ్రత్త..!!

శాంసంగ్ ఫోన్లు పేలుతున్నాయి..! జాగ్రత్త..!!

Author:

ఎన్నో సంవత్సరాల నుండి స్మార్ట్ ఫోన్ ల విక్రయంలో అందరి కంటే ఎక్కువ బిజినెస్ చేస్తున్న శాంసంగ్ కంపెనీకి ఇప్పుడు కష్టకాలం మొదలైంది, స్మార్ట్ ఫోన్ల తయారీలో ఎన్నో కంపెనీలు వచ్చిన శాంసంగ్ ఫోన్లకి ఉండే ప్రత్యేకత వేరు, కానీ ఇప్పుడు శాంసంగ్ ఫోన్ ని కొనాలంటేనే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది.

Samsang-phone-explode

నెల రోజుల క్రితం శాంసంగ్ కంపెనీ విడుదల చేసిన శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్ పేలిపోయింది. ఓ వినియోగదారుడు దీన్ని కొని ఛార్జింగ్ పెట్టిన కొద్దిసేపటికే అది పేలిపోయింది. ఈ వార్త ను శాంసంగ్ కంపెనీ కూడా ధ్రువీకరించింది. కానీ దీనిపై స్పదించడానికి నిరాకరించింది. దీనిపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా అమ్మకాలకు పెట్టిన లక్షలాది గెలాక్సీ నోట్ 7 ఫోన్ లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది.

Samsang-phone-explode

”అత్యంత నాణ్యమైన ప్రాడక్ట్స్ ను మా వినియోగదారులకు ఇవ్వడం మా కంపెనీ లక్ష్యం.. దీనికి కట్టుబడి ఉన్నాం” అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. మరోసారి ప్రయోగ పరీక్షలు జరిపేందుకు అన్ని ఫోన్లనూ వెనక్కి పిలిపిస్తున్నట్లు పేర్కొంది. కానీ కొన్ని ఫోన్ల బ్యాటరీలు పేలినట్లు వార్తలొచ్చాయి. ఛార్జింగ్ సమయంలోనే అవి పేలుతున్నాయి. ఓవర్ హీటింగ్ కూడా అవుతున్నట్లు తేలింది. దీనికి కారణం బ్యాటరీల్లో లోపమేనని, ఫాల్టీ బ్యాటరీల వల్లే వాటికి మంటలు అంటుకున్నాయని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు శాంసంగ్ వర్గాలు తెలిపాయి. సాధారణంగా మొత్తం కన్ సైన్ మెంట్ లో ఇలా బ్యాటరీ ప్రాబ్లం ఉన్నవి కేవలం 0.1 శాతం ఉంటాయని ఆ వర్గాలంటున్నాయి. తన సహచర టెక్నాలజీ పార్ట్ నర్ వెరిజోన్ తో ఈ అంశంపై చర్చిస్తున్నట్లు తెలిపాయి.

Samsang-phone-explode

ఈ మధ్య ఫోన్ బ్యాటరీలు పేలే సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి, బ్యాటరీలో లోపం వల్లనే అలా జరుగుతాయి, శాంసంగ్ తో పాటు ఇతర కంపెనీల ఫోన్లు కూడా పేలిపోతున్నాయి, బ్యాటరీ పేలినప్పుడు ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది కావున స్మార్ట్ ఫోన్ ని కొనేటప్పుడే బ్యాటరీ గురుంచి క్షుణ్ణంగా తెలుసుకుంటే మంచిది.

(Visited 2,867 times, 1 visits today)