Home / Entertainment / సంక్రాతికి బ్రహ్మోత్సవం

సంక్రాతికి బ్రహ్మోత్సవం

Author:

సూపర్ స్టార్ మహేష్ మేనియా ఇప్పుడు తెలుగులోనే కాదు..తమిళనాడులో కూడా కొనసాగుతుంది.‘శ్రీమంతుడు’ డబ్బింగ్ వర్షన్ ‘సెల్వంధన్’ అక్కడ కూడా కాసుల వర్షం కురిపిస్తుంది. ఇక ఫుల్ హిట్ జోష్ లో ఉన్న మహేష్ ఆగష్టు 18నుంచి బ్రహ్మోత్సవం షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాడు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె’ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుందగా, పివిపి బ్యానర్లో సినిమాను తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు.అయితే  బ్రహ్మోత్సవం ను ముందు సంక్రాంతి టైం లో రిలీజ్ చేద్దామని జూలై 10 నుండే షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చెసారు. కాని ఆ సినిమా మూడ్ లో పడి ‘శ్రీమంతుడు’ ప్రమోషన్ మిస్ అవుతుందని రిలీజ్ తర్వాతే బ్రహ్మోత్సవం స్టార్ట్ చేయాలని ప్రిన్స్ ఫిక్స్ అయ్యాడు. ఇక చేసేదేమీ లేక అలానే కానిచ్చారు దర్శక నిర్మాతలు. ఈ లోపు స్క్రిప్ట్ ని కూడా ఇంకా పకడ్బందీగా రాసుకున్నాడు డైరక్టర్ శ్రీకాంత్ అడ్డాల.నిజానికి బ్రహ్మోత్సవం సినిమాను మార్చ్ 28న రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి. కాని మహేష్ బాబు బ్రహ్మోత్సవం ను ఎలాగైనా డిశెంబర్ కల్లా కంప్లీట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట.మహేష్ తో సినిమా అంటే అది భారీ కాస్టింగ్ తో కూడుకున్న పని మరి ఇంత షార్ట్ పిరియడ్ లో..అంటే 90రోజుల్లో సినిమాను కంప్లీట్ చేయగలడా అని డౌట్స్ రేజ్ అవుతున్నాయి. కాని మహేష్ మాత్రం బ్రహ్మోత్సవం సినిమా టైటిల్ సెంటిమెంట్ పరంగా సంక్రాంతికి వస్తేనే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నాడట. ఓ పక్క ఇందులో హీరోయిన్లు కూడా ముగ్గురు హాట్ భామలను సెలెక్ట్ చేసి పక్కన పెట్టారు. మరి మహేష్ బాబు.. ముగ్గురు స్టార్ కథానాయికలు.. భారీ తారాగణంతో బ్రహ్మోత్సవం సంక్రాతికల్లా ఫినిష్ చేయడం కొంచం కష్టమే కాని మహేష్ అనుకున్నాడంటే అది కచ్చితంగా చేసి తీరుతాడు.సో ఫ్యాన్స్ కి మళ్ళీ మహేష్ సంక్రాతికి మరో పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నాడన్న మాట.

(Visited 69 times, 1 visits today)