“నాక్కొంచం తిక్కుంది దానికో లెక్కుంది” గబ్బర్ సింగ్ గా పవర్ స్టార్ స్టామినా ఏంటో చూపించిన సినిమాని ఇంకా ప్రేక్షకులు మర్చిపోలేదు. గబ్బర్ సింగ్ “రెండో బెల్టు పట్టుకొస్తా” అంటేనే ఈలలేస్తూ కెవ్వు కేక అన్న ఫ్యాన్స్ కోసం ఇప్పుడు ఏకంగా ఇంకో సినిమానే తెస్తున్నాడు పవర్ స్టార్. గబ్బర్ సింగ్ కి సీక్వెల్ గా ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ వస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా టీజర్ ముందే చెప్పినట్టు పవన్ కళ్యాన్ పుట్టిన రోజునే విడుదలయింది. సరికొత్త రకం బైక్ మీద పవన్ ఇంకా యంగ్ లుక్ తో కనిపిస్తున్నాడు. ఇంకా తన పవర్ తగ్గలేదన్నట్టు ఎనర్జిటిక్ గా కనిపిస్తున్న పవన్ ఇప్పటికీ యంగ్ హీరోలతో ఏ మాత్రం తీసిపోనన్నట్టు కనిపించాడు. సర్దార్ గబ్బర్ సింగ్ గా ఖాకీ డ్రెస్సులో మెరిసిపోతున్నాడు ఏకంగా 4 తుపాకులు పట్టుకొని హల్ చల్ చేస్తున్నాడు. గత సినిమా గబ్బర్ సింగ్ తో ఏమాత్రం సంబంధం లేకుండా ఓ సరికొత్త కథతో వస్తున్న ఈ సినిమాకు శరత్ మరార్ నిర్మాత కాగా బాబి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో పవన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్నొ సినిమాలలో అగ్ర తార స్థానం లో కూడా నిలిచిన ఈ అందాల బొమ్మ మొదటిసారి పవన్ తో నటించటం విశేషం. ఈ జంట తెర పై ఎలా ఉండ బోతోందోనని ఆసక్తిగా వున్నారు ప్రేక్షకులు…
పుట్టిన రోజు శుభాకాంక్షలతోనే సర్దార్ కి బెస్టాఫ్ లక్ కూడా చెప్తున్నారూ ఇండస్ట్రీ జనాలు. ఇప్పటికే మెగా పవర్ స్టార్ కూడా ఈ టీజర్ సూపర్ అంటూ మెచ్చుకున్నాడు. తన బ్రూస్లీ టీజర్ ని బాబాయ్ కి బర్త్ డే గిఫ్ట్ గా ఇచ్చేసాడు కూడా , అలజడి.కాం తరఫున కూడా పవర్ స్టార్ కి హ్యాపీ బర్త్ డే.