Home / Inspiring Stories / తొలి మహిళా బస్ డ్రైవర్ కు మన ఆర్టీసీలో ఉద్యోగం.

తొలి మహిళా బస్ డ్రైవర్ కు మన ఆర్టీసీలో ఉద్యోగం.

Author:

మహిళలు ఏ రంగంలో అయిన దూసుకపోగలరని ఇప్పటికే చాలాసార్లు నిరూపించారు, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే మహిళల పై ఉన్న ఆంక్షలు, కట్టుబాట్లు తగ్గుతున్నాయి, వారికీ అన్ని రంగాలలో ప్రోత్సాహం లభిస్తుంది, మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో మొదటి మహిళ బస్సు డ్రైవర్ గా ఉద్యోగం సంపాదించి చరిత్ర సృష్టించింది మన రాష్ట్రానికి చెందిన సరిత, తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన సరిత ఎన్నో కష్టాలని, వివక్షలని ఎదుర్కొని తోలి మహిళ ఆర్టీసీ డ్రైవర్ గా ఉద్యోగం సంపాదించింది, బస్సు డ్రైవింగ్ అంటే చాలా కష్టంతో కూడుకున్న పని, అలాంటి పనిని ఒక తెలుగు మహిళ మన దేశ రాజధానిలో ఎంతో సులభంగా చేయడం మనందరికీ ఎంతో గర్వకారణం.

First-Woman-RTC-Driver

ఢిల్లీలో మొదటి మహిళ డ్రైవర్ గా గుర్తింపు పొందిన సరితని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖా మంత్రి మహేందర్ రెడ్డి అభినందించారు, తెలంగాణలో ఆర్టీసీ డ్రైవర్ గా ఉద్యోగం కల్పించాలని మంత్రికి సరిత విజ్ఞప్తి చేసారు, సరిత విజ్ఞప్తికి స్పందించిన మంత్రి సరితకు త్వరలోనే తెలంగాణ ఆర్టీసీ లో బస్సు డ్రైవర్ ఉద్యోగం కల్పిస్తాం అని హామీ ఇచ్చారు.

(Visited 567 times, 1 visits today)