కోలీవుడ్‌లో టాప్ స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్న విజయ్ తెలుగులో మాత్రం ఆస్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. సూర్య, విశాల్, కార్తీ లాంటి హీరోలు తెలుగునాట కూడా మంచి మార్కెట్ సాధించినా విజయ్ మాత్రం ఇంత వరకు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. తుపాకి, అదిరింది లాంటి సినిమాలు టాలీవుడ్‌లో పరవాలేదనిపించినా విజయ్ స్థాయి సక్సెస్‌లు మాత్రం సాధించలేకపోయాయి. తాజాగా మరోసారి మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కార్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన తుపాకి, కత్తి సినిమాలు ఘనవిజయం సాధించటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను సర్కార్ అందుకుందా..? ఈ సినిమాతో అయినా విజయ్ తెలుగు మార్కెట్‌లో జెండా పాతాడా..? స్పైడర్ సినిమాతో టాలీవుడ్‌కు షాక్ ఇచ్చిన దర్శకుడు మురుగదాస్, సర్కార్‌తో ఆకట్టుకున్నాడా..?
సుందర్(విజయ్) అమెరికాలో ఒక పేరు మోసిన కంపెనీకి సీఈవో. సంవత్సరానికి రూ.వెయ్యి కోట్ల జీతం. ఓటు వేయడానికి సుందర్ ఇండియాకి వస్తాడు. అప్పటికే అతడి ఓటును ఎవరో వేసేస్తారు. తన ఓటు తనకు కావాలని కోర్టుకెక్కుతాడు సుందర్. రాజ్యాంగాన్ని, హక్కులను దృష్టిలో పెట్టుకుని న్యాయస్థానం కూడా అతని ఓటును అతడికి తిరిగి ఇవ్వాలని తీర్పు ఇస్తుంది. ఆ తీర్పును అనుసరించి, దాదాపు మూడులక్షల మంది న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు. దాంతో ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాల్సిన పుణ్యమూర్తి(రాధా రవి) ప్రమాణ స్వీకారానికి ముందే ఎన్నికలు రద్దవుతాయి. మరో 15రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని కోర్టు తీర్పు చెబుతుంది. ఆ ఎన్నికల్లో సుందర్ సీఎం ప్రత్యర్థిగా నిలబడాలని నిర్ణయం తీసుకుంటాడు. మరి ఆ ఎన్నికల్లో సుందర్ గెలిచాడా? తన ఓటును తాను దక్కించుకోవడానికి వచ్చిన సుందర్ ఓటర్లందరికీ ఏం చెప్పాడు. వాళ్లలో చైతన్యం ఎలా తీసుకొచ్చాడన్నది సినిమా.
సుందర్ రామస్వామి (విజయ్) సంవత్సరానికి 1800 కోట్లు సంపాదించే బిజినెస్‌మేన్. తను ఏ దేశంలో అడుగుపెట్టిన అక్కడి కంపెనీలను దెబ్బతీసి, వాటిని మూసేయించే కార్పోరేట్ క్రిమినల్. అలాంటి సుందర్ భారత్‌కు వస్తుండన్నా సమాచారంతో ఇక్కడి కార్పోరేట్ కంపెనీలన్ని ఉలిక్కి పడతాయి. కానీ ఇండియా వచ్చిన సుందర్ కేవలం తన ఓటు హక్కును వినియోగించుకోవడానికే వచ్చానని చెప్పటంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. ఓటు వేయడానికి వెళ్లిన సుందర్‌కు తన ఓటును ఎవరో దొంగ ఓటు వేశారని తెలుస్తుంది. దీంతో తన ఓటు కోసం కోర్టును ఆశ్రయిస్తాడు. సుందర్ ఓటు హక్కు వినియోగించుకునే వరకు అక్కడ ఎలక్షన్ కౌంటింగ్ ఆగిపోతుంది. సుందర్ విషయం తెలిసి ఓటు వేయలేకపోయిన దాదాపు 3 లక్షల మందికిపైగా ప్రజులు అదే తరహాలో కేసుల వేస్తారు. దీంతో ఎలక్షన్‌లను రద్దు చేసి తిరిగి 15 రోజుల్లో ఎన్నికల నిర్వహించాలని కోర్టు తీర్పునిస్తుంది. తరువాత అధికారి పార్టీ నేతలతో గొడవల కారణంగా సుందర్ స్వయంగా ఎలక్షన్‌లలో పోటీ చేయాలని నిర్ణయించుకుంటాడు. కార్పోరేట్ క్రిమినల్‌గా పేరు తెచ్చుకున్న సుందర్ ఇక్కడి కరుడు గట్టిన రాజకీయనాయకులతోఎలా పోరాడాడు? పోటికి దిగిన సుందర్‌కు ఎదురైన సమస్యలేంటి.? అన్నదే మిగతా కథ.
విజయ్‌కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. తన అభిమానులను మరోసారి మెస్మరైజ్ చేయగలిగాడు. పొలిటికల్ డైలాగ్‌లు చెప్పేటప్పుడు విజయ్ హావభావాలు ఆకట్టుకుంటాయి. కీర్తి సురేష్‌ది అతిథి పాత్రలా ఉంది. ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం లేదు. సీఎంగా కనిపించిన పాత్రలో తెలుగు నటుడిని ఎంచుకుంటే బాగుండేది. తెరపై ప్రతినాయికగా వరలక్ష్మి బాగా రాణించింది. తన రాకతో విజయ్‌కు ఒక సమఉజ్జీగా నిలబడిన పాత్ర ఒకటి కనిపిస్తుంది. రెహమాన్ సంగీతం విషయానికొస్తే పాటలు ఆకట్టుకోవు. ఆ పాటల్లో వాడే పదాలు కూడా కృతకంగా అనిపించాయి. నేపథ్య సంగీతంలో రెహమాన్ మార్కు కనిపిస్తుంది. విజువల్‌గా సినిమా బాగుంది. పోరాట సన్నివేశాల్లో కెమెరా పనితనం చక్కగా ఉంది. మురుగదాస్ మరోసారి తన శైలికి తగిన కథను ఎంచుకున్నాడు. ప్రస్తుత రాజకీయాలపై ఒక వ్యంగ్యాస్త్రాన్ని సంధించగలిగాడు. అయితే, కమర్షియల్ అంశాల జోడింపులో నూటికి నూరుపాళ్లు విజయం సాధించాడు. కొన్నిసార్లు కమర్షియల్ విలువల కోసమే తన పంథా మార్చుకోవాల్సి వచ్చింది.
ప్లస్ పాయింట్స్ :
మైనస్ పాయింట్స్ :
పంచ్ లైన్: ‘సర్కార్’ ….రాజకీయ చిత్రం
రేటింగ్ : 3/5
గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
‘సర్కార్ ’ మూవీపై మీ అభిప్రాయం చెప్పండి ?