Home / Inspiring Stories / “సేవ్ వైట్‌ఫీల్డ్” నినాదంతో కద౦ తొక్కిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు

“సేవ్ వైట్‌ఫీల్డ్” నినాదంతో కద౦ తొక్కిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు

Author:

bengaluru

బెంగళూరు, భారతదేశపు ఐ.టి (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) రంగంలో ముందు ఉండే నగరం. ఎంతో మంది బెంగళూరు కి వలస వచ్చి సాఫ్ట్‌వేర్ కంపనీలలో ఉద్యోగం చేస్తున్నారు. అబ్బురపరిచె సాలరీ, మంచి మంచి ఆఫీసులు ఉన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మొదటి సారిగా బెంగళూరులోని అద్వానపు రోడ్లు, ట్రాఫిక్, చెత్త సమస్యలపై తమ గళం వినిపించారు.

saveWhitefield

“సేవ్ వైట్‌ఫీల్డ్” అనే నినాదంతో 10 వేల మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఈ రోజు రోడ్ల పక్కన నిల్చోని, వారు రోజు నిజ జీవితంలో ఎదురుకుంటున్న సమస్యలను ప్లకార్డ్ లపై రాసి ప్రదర్శించారు. ప్రతిరోజు బెంగళూరు లోని అధ్వాన్నమైన, రంధ్రాలు పడిన రోడ్ల వలన గంటల తరబడి ట్రాఫిక్ జామ్లు మరియు పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. అన్ని రోడ్లు కాకపోయినా ప్రభుత్వానికి ఏటా 20 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూర్చుతున్నవైట్‌ఫీల్డ్ ఏరియాలో కూడా రోడ్ల పరిస్థితి ఇలాగే ఉంది. దీనికి నిరసనగా తమ సమస్యలను ప్రభుత్వంకి తెలపడానికే తాము శాంతియుతంగా ఈ పని చేసినట్టు నిర్వాహకులు ప్రకటించారు. ఏది ఏమైనా ప్రభుత్వం వీరి మొర ఆలకించి బెంగళూరు సమస్యలను త్వరగా పరిస్కరించాలని కోరుకుందాం.

 

(Visited 117 times, 1 visits today)