Home / Entertainment / సవ్యసాచి మూవీ రివ్యూ

సవ్యసాచి మూవీ రివ్యూ

Author:

అక్కినేని వారసుడిగా వెండితెర అరంగేట్రం చేసిన నాగచైతన్య కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి యాక్షన్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. లవర్‌ బాయ్‌గా సూపర్‌ హిట్లు సాధించిన ఈ స్టార్‌ వారసుడు యాక్షన్‌ హీరోగా మాత్రం ప్రతీ సారి ఫెయిల్‌ అయ్యాడు. అయినా మరోసారి అదే జానర్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు చైతూ. తనకు ప్రేమమ్‌ లాంటి బిగ్‌ హిట్ అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమా చేశాడు. మరి ఈ సినిమా అయినా చైతూకు యాక్షన్‌ హీరోగా సక్సెస్‌ ఇస్తుందా..?

కథ:

విక్ర‌మ్ ఆదిత్య (నాగ‌చైత‌న్య‌) వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు తీసే ఓ ద‌ర్శ‌కుడు. ఆరేళ్ల కింద‌ట కాలేజీలో చిత్ర (నిధి అగర్వాల్‌)ని చూసి ప్రేమిస్తాడు. ఒక‌రికొకరు ద‌గ్గ‌ర‌య్యే క్ర‌మంలోనే దూర‌మ‌వుతారు. ఆరేళ్ల త‌ర్వాత అనుకోకుండా మ‌ళ్లీ క‌లుసుకుంటారు. విక్ర‌మ్ ఆదిత్య వ్యానిషింగ్ ట్విన్ సిండ్రోమ్‌తో పుట్టిన వ్య‌క్తి. అత‌నిలో మ‌రో మ‌నిషి కూడా ఉంటాడు. భావోద్వేగానికి గురైనా, ఎక్కువ సంతోషం క‌లిగినా ఎడ‌మ చేతి వైపున ఉంటూ స్పందిస్తుంటాడు ఆ రెండో మ‌నిషి. ఒక‌రిలో ఇద్ద‌రున్నారు కాబ‌ట్టే త‌ల్లి ఒకరి పేరు విక్ర‌మ్‌గా, మ‌రొక‌రి పేరు ఆదిత్య‌గా పిలుస్తుంటుంది. ప్రేయ‌సికి మ‌ళ్లీ ద‌గ్గ‌రై ఆనందంగా గ‌డుపుతున్న స‌మ‌యంలోనే విక్ర‌మ్ ఆదిత్య అక్క శ్రీదేవి (భూమిక‌) ఇంట్లో బాంబు పేలుతుంది. బావ చ‌నిపోగా, త‌న‌కి ఎంతో ఇష్ట‌మైన అక్క కూతురు మ‌హాల‌క్ష్మి కిడ్నాప్‌కి గుర‌వుతుంది. ఇంత‌కీ ఆ బాంబు పేలుడు వెన‌క ఎవ‌రున్నారు? కిడ్నాప్‌కి గురైన అక్క కూతురు మహాల‌క్ష్మిని విక్ర‌మ్ ఆదిత్య ఎలా ర‌క్షించాడు? ఎడ‌మ చేతిలో ఉన్న ఆదిత్య ఎలా సాయం చేశాడు? ఈ క‌థ‌లో అరుణ్ (మాధ‌వ‌న్ ) ఎవ‌రు? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

అలజడి విశ్లేషణ:

వానిషింగ్‌ ట్విన్‌ సిండ్రోమ్‌ అనే డిఫరెంట్ పాయింట్‌ను ఎంచుకున్న దర్శకుడు చందూ మొండేటి యాక్షన్‌ ఎమోషనల్‌ అంశాలతో మంచి కథను రెడీ చేసుకున్నాడు. అయితే ఆ కథను తెర మీద ఆవిష్కరచటంలో కాస్త తడబడినట్టుగా కనిపిస్తుంది. సినిమాను ఇంట్రస్టింగ్‌పాయింట్‌తో మొదలు పెట్టినా.. తరువాత ఫస్ట్‌ హాఫ్‌ అంతా హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలతో నడిపించాడు. హీరోకు ఉన్న ఎడమ చేతి ప్రాంబ్లమ్‌కు సంబంధించిన సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో లేవు. ప్రీ ఇంట్రర్వెల్‌ వరకు అసలు కథ మొదలు కాకపోవటం నిరాశకలిగిస్తుంది.

savyasachi-Movie-Review-and-rating

నటీనటుల

నాగ‌చైత‌న్య‌, మాధ‌వ‌న్‌ల అభిన‌యం ఆక‌ట్టుకుంటుంది. నిధి అగ‌ర్వాల్ తెర‌పై క‌నిపించిన విధానం చాలా బాగుంది. ఆమె అందానికి మంచి మార్కులు ప‌డ‌తాయి. భూమిక చిన్న పాత్ర‌లో క‌నిపిస్తుందంతే. వెన్నెల కిషోర్‌, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్, సుద‌ర్శ‌న్ పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు. తాగుబోతు ర‌మేష్ పాత్ర కొత్త‌గా ఉంటుంది. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయిని పెంచాయి. యువ‌రాజ్ కెమెరా ప‌నిత‌నం, కీర‌వాణి సంగీతం సినిమాపై మంచి ప్రభావం చూపించాయి. స్వ‌త‌హాగా ర‌చ‌యిత అయిన ద‌ర్శ‌కుడు చందూ మొండేటి క‌థ, మాట‌లు చాలా బాగున్నాయి. అయితే ఆ క‌థ‌ని అదే స్థాయిలో తెర‌పైకి తీసుకురావ‌డంలో మాత్రం త‌డ‌బాటుప‌డ్డారు.

ప్లస్ పాయింట్స్ :

  • నాగచైతన్య నటన
  • మాధవన్‌ నటన
  • క‌థ‌
  • యాక్షన్‌ సీన్స్‌
  • ప‌తాక స‌న్నివేశాలు

మైనస్ పాయింట్స్ :

  • రొటీన్‌ టేకింగ్
  • ప్ర‌థ‌మార్ధ క‌థ‌నం

పంచ్ లైన్:   ‘సవ్యసాచి’… ఒకే దేహంలో ఇద్దరు

రేటింగ్ :  3/5

గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

‘వీర భోగ వసంత రాయలు’ మూవీపై మీ అభిప్రాయం చెప్పండి  ?

(Visited 1 times, 1 visits today)