Home / Inspiring Stories / ఎటువంటి క్రెడిట్ రేటింగ్ లేకపోయిన ఉచితంగా క్రెడిట్ కార్డు ఇస్తామంటున్న ఎస్బీఐ.

ఎటువంటి క్రెడిట్ రేటింగ్ లేకపోయిన ఉచితంగా క్రెడిట్ కార్డు ఇస్తామంటున్న ఎస్బీఐ.

Author:

ఉద్యోగస్తులకు ఒకప్పుడు ఎగబడి క్రెడిట్ కార్డులు ఇచ్చిన సంస్థలు ఖాతాదారులు బాకీలు చెల్లించకపోవడంతో కాస్త వెనక్కు తగ్గాయి. గతంలో చేసిన పొరబాట్లు రిపీట్ కాకుండా ఈ మధ్య కాలంలో క్రెడిట్ కార్డు పొందాలంటే సవాలక్ష ఆంక్షలు పెట్టాయి క్రెడిట్ కార్డ్ సంస్థలు. ఉద్యోగస్తుల జీతభత్యాలు వంటివి ఖచ్చితంగా ధృవికరించుకున్న తర్వాతనే కార్డు జారీ చేస్తున్నాయి. కాని ఏలాంటి కండీషన్లు లేకుండా కేవలం తమ ఖాతాలో 20,000 రూపాయల నుండి 25,000 రూపాయలు నిల్వ ఉంటే క్రెడిట్ కార్డు ఇస్తామని ప్రకటించింది స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.

sbi credit card

డిజిటల్‌ లావాదేవీలు, క్రెడిట్‌ కార్డుల వినియోగాన్ని ఉంచే ఉద్దేశ్యంతో ఉన్నతి అనే పధకాన్ని ప్రారంభించిన ఎస్బీఐ, ఆ పధకం కిందా కొత్త క్రెడిట్ కార్డులు పొందేవారికి నాలుగేళ్ల పాటు ఎలాంటి వార్షిక ఫీజు వసూలు చేయరు. అంతే కాకుండా కార్డు జారీ చేయడానికి ఎలాంటి క్రెడిట్‌ హిస్టరీనీ పరిశీలించరు. కేవలం కార్డుకు దరకాస్తు చేసుకునేటప్పుడు మీ ఎస్బీఐ ఖాతాలో మినిమం 20,000 రూపాయలు ఉండాలని ప్రకటించింది ఎస్‌బీఐ. ఉన్నతి పధకం క్రెడిట్‌ కార్డుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి దోహదపడుతోందని ఈ సంధర్భంగా ఎస్‌బీఐ ఛైర్మన్ అరుంధతి భట్టాచార్య ప్రకటించారు.

(Visited 1,518 times, 1 visits today)