ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్ల విషయంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువడించింది. ఉద్యోగాల ప్రమోషన్‌పై 2006లో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలంటూ దీనిపై ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనంతో విచారణ చేయాలంటూ పిటిషన్ దాఖలైంది.
దీన్ని విచారణ చేసిన ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వర్తించవంటూ ఏకపక్ష నిర్ణయాన్ని వెల్లడించింది. అంతేకాదు 2006లో ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును రివ్యూ చేసేందుకు ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఏర్పాటు అవసరం లేదని చెప్పింది.
ప్రమోషన్‌లలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు రిజర్వేషన్ కోటా ప్రయోజనాలు పొందేందుకు కొన్ని షరతులు విధిస్తూ 2006 (ఎం.నాగరాజు కేసు)లో వచ్చిన తీర్పుపై పునరాలోచన చేయాలని దాఖలైన పిటిషన్‌ను విచారిస్తూ ఈ సంచలన తీర్పు ప్రకటించింది కోర్టు. ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల విషయంలో రిజర్వేషన్లు పాటించాల్సిన అవసరం లేదని ప్రకటించింది సుప్రీం.
Must Read : ఆధార్ చట్టబద్ధతపై సుప్రీం సంచలన తీర్పు