Home / Inspiring Stories / ప్రధాని నరేంద్ర మోడీకే షాక్ ఇచ్చిన స్కూల్ పిల్లాడు…!

ప్రధాని నరేంద్ర మోడీకే షాక్ ఇచ్చిన స్కూల్ పిల్లాడు…!

Author:

రాజకీయ నాయకుల సభలు అయితే చాలు అవి పార్టీ కార్యక్రమాలైన, ప్రభుత్వ కార్యక్రమాలైన సరే బస్సులు, కార్లు, వ్యాన్లని ఏర్పాటు చేసి జనాలని తరలిస్తుంటారు, ఇందులో కొంతమందే స్వచ్ఛందంగా వచ్చే వారు ఉంటారు, మిగిలిన వారిని డబ్బులిచ్చో, బయపెట్టో, బ్రతిమాలో సభలకి వచ్చేటట్టు చేస్తారు, వీరి సభల వల్ల సామాన్య జనం నష్టపోతున్న పట్టించుకోరు, ఒకవేళ అడిగితే ఏం చేస్తారో అని సామాన్య జనం భయపడుతుంటారు.

Is-Your-Rally-More-Important-Than-My-School--Devansh-Jain--Letter-To-PM-Narendra-Modi

మధ్యప్రదేశ్ కి చెందిన ఒక స్కూల్ పిల్లాడు మాత్రం ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకే షాక్ ఇచ్చాడు, క్విట్ ఇండియా ఉద్యమం 75 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మధ్యప్రదేశ్ లో స్వాతంత్ర్య సమరయోథుడు చంద్రశేఖర్ అజాద్ స్వగ్రామమైన భబ్రలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ప్రధాని మోడీ హాజరు కావాల్సి ఉంది, ఈ సభకి భారీగా జనాలని సమీకరించాలని అధికారులు, నాయకులూ నిర్ణయించుకున్నారు, అందుకోసం పలు ప్రయివేట్ స్కూళ్ళు, కాలేజీలు, ప్రభుత్వ స్కూళ్ళకి సంబంధించిన వాహనాలని అధికారులు సేకరించారు, ఇలా అధికారులు సేకరించిన వాహనాల్లో ఎనిమిదో తరగతి చదివే దేవాన్ష్ జైన్ అనే కుర్రాడు చదివే స్కూలుకు చెందిన బస్సు కూడా ఉంది. స్కూల్ బస్సుని అధికారులు తీసుకెళ్లిపోవడంతో దేవాన్ష్ జైన్ స్కూల్ కి వెళ్లలేకపోతున్నాడు.

Is-Your-Rally-More-Important-Than-My-School--Devansh-Jain--Letter-To-PM-Narendra-Modi

దీని గురుంచి దేవాన్ష్ మోడీకి లేఖ రాసాడు,

మీ కార‌ణంగానే నేను స్కూలుకు వెళ్ల‌లేక పోయాను.. నా స్కూలుకంటే మీ మీటింగులే ఎక్కువా..?”  “మీరు అమెరికాలో ప్ర‌సంగిస్తున్న‌ప్పుడు పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు వ‌చ్చారు..వారిని త‌ర‌లించేందుకు కూడా స్కూలు బ‌స్సుల‌ను మాట్లాడారా” అంటూ ప్ర‌ధానికి రాసిన లేఖ‌లో అడిగాడు దేవాన్ష్‌. “నేను మీ అభిమానిని.. రేడియో ద్వారా మ‌న్ కీ బాత్‌లో మీరు మాట్లాడుతున్న‌ప్పుడు నేను మిస్స‌వ్వ‌కుండా వింటాను. మన్ కీ బాత్ వినేందుకు నా ఫ్రెండ్స్‌తో కూడా పోట్లాడుతాను . మీటింగుల కోసం స్కూలు బ‌స్సుల‌ను వినియోగించుకోవ‌ద్ద‌ని శివ‌రాజ్ సింగ్ మామ‌కు కూడా మీరు చెప్పండి” ఆ బాబు మోడీని కోరారు. ” కాంగ్రెస్ వారిలా మీరుకూడా ఉండ‌కండి ..ఎందుకంటే మా చ‌దువుల‌ప‌ట్ల మా భ‌విష్య‌త్తుపై మీరు బాధ్య‌త‌తో ఉన్నారు” అని చిన్నారి పేర్కొన్నాడు.“ఇలా చేస్తే ప్ర‌జ‌లు మోడీ స‌భ‌ల‌కు స్వ‌చ్చందంగా వ‌స్తున్నారు త‌ప్ప ఎవ‌రో మేనేజ్ చేస్తే రావ‌ట్లేదు అని మోడీ అంకుల్ స‌భ‌లో నేనే గ‌ర్వంగా చెబుతాను” అంటూ లేఖ‌ను ముగించాడు దేవాన్ష్ జైన్.

ఈ లెటర్ సోషల్ మీడియా లో వైరల్ అయిపోయింది, ఈ దెబ్బకి అధికారులు వెంటనే ఆ స్కూల్ ని మోడీ ర్యాలీ నుండి తొలగించారు, దీనిపై మోడీ స్పందించాలని నెటిజన్లు అడుగుతున్నారు.

(Visited 701 times, 1 visits today)