Home / Political / 10 వ తరగతి విద్యార్ధి కి అటెండెన్స్ లేదని 50 వేలు లంచం అడిగిన స్కూల్ ప్రిన్సిపాల్.

10 వ తరగతి విద్యార్ధి కి అటెండెన్స్ లేదని 50 వేలు లంచం అడిగిన స్కూల్ ప్రిన్సిపాల్.

Author:

ఒక 10 వ తరగతి విద్యార్ధి అటెండెన్స్, ఇంటర్నల్ మార్కుల వివరాలు మార్చడానికి లంచం అడుగుతూ కెమెరాకు చిక్కారు హైదరబాద్ మౌళాలి లోని సెయింట్ జార్జ్ హైస్కూల్ ప్రిన్సిపాల్. కొన్ని అవాంతర కారణాల వలన ఒక 10 వ తరగతి విద్యార్ధి కి సరిపోను అటెండెన్స్ లేదు దానితో పాటు పాఠశాలలో నిర్హహించిన ఇంటర్నల్ పరీక్షలకు కూడా ఆ విద్యార్ధి హాజరు కాలేదు కాని అటెండెన్స్, ఇంటర్నల్ మార్కులు లేకపోతే ఆ విద్యార్ధి కామన్ బోర్డు పరీక్షలకు హాజరుకాలేడు. దానితో అతని అటెండెన్స్, ఇంటర్నల్ మార్కుల వివరాలు మార్చడానికి లంచం ఇస్తే పని అవుతుందని ఆ విద్యార్ధి బంధువులకు తెలిపింది సెయింట్ జార్జ్ హైస్కూల్ ప్రిన్సిపాల్.


ఈ ఉదంతం అంతా వీడీయో లో రికార్డు అవుతుందని మొదట్లో గమనించలేకపోయిన ఆ ప్రిన్సిపాల్.. లంచం ఎవరెవరికి చేరుతుందో మొత్తం చెప్పేసింది. ఇదే విషయాన్ని ఆ విద్యార్ధి బంధువులు మండల విద్య శాఖాదికారి ఆర్ శ్రీనివాస్ కి తెలుపగా, ప్రతి విద్యార్ధికి ఇంటర్నల్ పరీక్షల్లో 20 మార్కులకు గాను కనీసం 7 మార్కులు అయినా వచ్చి ఉండాలని.. ఆ మార్కులు వేయడం కొరకే పాఠశాల డబ్బులు డిమాండ్ చేసి తమ పేరు చెప్పి ఉంటుందని, దానితో తమకు ఏం సంభందం లేదని ప్రకటించారు. చివరకు ఈ విషయం జిల్లా విద్య శాఖాదికారి ఉషారాణి దాక చేరడంతో అమే విచారణకు అదేశించారు.

(Visited 726 times, 1 visits today)