Home / Inspiring Stories / ప్రభుత్వ బడి పిల్లల బాగు కోసం తన నగలు అమ్మిన పంతులమ్మ.

ప్రభుత్వ బడి పిల్లల బాగు కోసం తన నగలు అమ్మిన పంతులమ్మ.

Author:

పాత రోజుల్లో ఎంతో మంది విద్యార్థుల‌ను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలలు కాలంతో పాటే ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురై ఇప్పుడు విద్యార్థుల‌ కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా విద్యను భోదిస్తున్నా విద్యార్థుల‌కు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ప్రైవేట్ బడులలో వేలకు వేలు ఫీజులు కట్టి విద్యను కొనుక్కుంటున్నారు నేటితరం విద్యార్థులు. అయితే అలాంటి ప్రభుత్వ బడిలో పని చేసే ఒక పంతులమ్మ తన పేద విద్యార్థుల‌కు కూడా ప్రైవేట్ బడులలో ఉండే విధంగా ఆధునిక సదుపాయలు కల్పించి విద్యాభోదన చేయాలని సంకల్పించింది. కార్పొరేట్ స్కూళ్ల‌లో చ‌దివే పిల్ల‌లు ఇంగ్లిష్ ఎలా మాట్లాడ‌తారో ప్రభుత్వ స్కూళ్ల‌లో చ‌దివే పిల్ల‌లు కూడా అలా మాట్లాడేలా చదువు చెప్పాలనుకుంది, కాని దానికి ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం అందకపోవడంతో తన దగ్గర ఉన్న బంగారు నగలు అమ్మి 1 లక్ష 60 వేల రూపాయలు సమీకరించుకొని ఆంగ్ల బోధనకు కావాల్సిన వస్తువులు, డిజిటల్ క్లాసు రూమును తయారు చేయించింది. అమే పేరే అన్నపూర్ణ మోహన్, త‌మిళ‌నాడులోని కంధాడు అనే ప్రాంతంలో ఉన్న పంచాయత్ యూనియ‌న్ ప్రైమ‌రీ స్కూల్ (పీయూపీఎస్‌) ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఇంగ్లిష్ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తోన్న ఆమె గురించి క్రింద చదవండి.

Annapurna Mohan Tamil Teacher

ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలైన అన్నపూర్ణ ఎలాగైనా తన విద్యార్థుల‌కు ఇంగ్లీష్ నేర్పించి ఆ సబ్జెక్టు మీద భయం పోగొట్టాలనుకుంది. భట్టీ విధానం కాకుండా అంత‌ర్జాతీయ పాఠ‌శాలల్లో విద్యార్థుల‌కు బోధించే ప‌ద్ధ‌తిలో విద్యార్థుల‌కు ఇంగ్లిష్ పాఠాలు చెప్ప్లనుకుంది కాని ఆ పాఠ‌శాల‌లో స‌రైన ప‌రిక‌రాలు లేవు. దీంతో ఆమె తన సొంత నగలు అమ్మగా వచ్చిన లక్షా 60వేల పైచిలుకు డబ్బుతో పిల్లలకు అవసరమైన మెటీరియల్ అంతా కొన్నారు. ఫర్నిచర్ మొదలుకొని, పుస్తకాల వరకు అన్ని సొంత పైసలతోనే సమకూర్చారు. కార్పొరేట్ స్కూల్ కి ఏమాత్రం తీసిపోని విధంగా సకల సౌకర్యాలతో ఒక మోడల్ క్లాస్ రూంగా తీర్చిదిద్దారు. అన్ని సౌకర్యాలు ఉండడంతో పిల్లలు కూడా చక్కగా అన్నపూర్ణ టీచర్ చెప్పిన విధంగా ఇంగ్లీష్ సాధన చేసి ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల‌కు ఏమాత్రం తీసిపోని విధంగా తయారయ్యారు. ఈ విషయాలను అన్నపూర్ణ మోహన్ గారు ఎప్పటికప్పుడు తన ఫేస్ బుక్ ద్వారా తెలుపుతుండడంతో ఇతరులు కూడా ఆర్ధికంగా సహాయం చేయడం మొదలుపెట్టారు. దానితో ఆ డబ్బులతో ఆ పాఠశాలలో డిజిటల్ తరగతి గది ప్రారంభించారు. మనకెందుకులే అని ఊరుకోకుండా తన విద్యార్థుల‌కు మంచి విద్యను అందించే వరకు రాజీ పడని అన్నపూర్ణ టీచర్ గారు అందరికి ఆదర్శప్రాయురాలు.

ఈ ఆదర్శ పంతులమ్మకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఆ పంతులమ్మ ఫేస్ బుక్ అకౌంట్ Annapurna Mohan ని చూడండి.

(Visited 1,223 times, 1 visits today)