హిందూ సాంప్రదాయంలో పాటించే పద్దతులలో ప్రతీది సైన్స్ కు సంబంధం ఉంటుంది. మనం దరించే ప్రతి వస్తువు మనకు ఆరోగ్యంతో పాటు వికాసాన్ని అందిస్తుంది. చివరకు మొలతాడు ధరించడం వెనుక కూడా ఒక అంతరంగం ఉంది అదేంటో మీరే చూడండి.
మొలతాడు ధరించడం వెనుక హిందూ సాంప్రదాయంలో ఒక భాగం ఎందుకంటే ఇది హిందువులలో ప్రతి మగాడికి ఉంటుంది. చిన్న పిల్లలకు మొలతాడు కడితే వారు ఎదుగుతున్న సమయంలో ఎముకలు, కండరాలు సరైన పద్ధతిలో వృద్ధి చెందుతాయట. ప్రధానంగా మగ పిల్లల్లో పెరుగుదల సమయంలో పురుషాంగం ఎటువంటి అసమతుల్యానికి గురికాకుండా కచ్చితమైన పెరుగుదల ఉండేందుకు మొలతాడును కడతారట.
మొలతాడు కట్టుకుంటే రక్త ప్రసరణ కూడా మెరుగు పడుతుందట. మగవారికి హెర్నియా రాకుండా మొలతాడు కాపాడుతుందట. దీన్ని పలువురు సైంటిస్టులు కూడా నిరూపించారట.మన దగ్గర చిన్న పిల్లలకు ఎక్కువగా వెండితో చేసిన మొలతాడును కట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఎలాంటి మొలతాడు కట్టినా దాంతో మాత్రం ఉపయోగమే ఉంటుందన్నమాట.
Must Read: Video:పసుపు పచ్చగా ఉన్న దంతాలను నిమిషాల్లో తెల్లగా మార్చుకోవచ్చు.