Home / Inspiring Stories / భారతీయ మహిళలు ధరించే ఆభరణాలు వెనుక ఉన్న సైన్స్ గురుంచి తెలుసుకోండి.

భారతీయ మహిళలు ధరించే ఆభరణాలు వెనుక ఉన్న సైన్స్ గురుంచి తెలుసుకోండి.

Author:

భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను నిశితంగా పరిశీలీస్తే అందులో ఉన్న సైన్స్ గురుంచి తెలుసుకోవచ్చు,ఇప్పుడు మనం పాటించే ప్రతి సంప్రదాయం వెనుక ఉండే సైన్స్ గురుంచి తెలుసుకుంటే మనమే ఆశ్యర్యపోతాం, మన పెద్దవాళ్ళు ఆచారల వెనకున్న సైన్స్ ఇది, దీనిని పాటిస్తే ఇలా ఉంటుందని చెబితే ప్రతి ఒక్కరు మన ఆచారాలను సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటించడమే కాదు ఇతరులకు సైతం మన గొప్పతనం గురించి వివరిస్తారు.

మహిళలు తాళి ఎందుకు కట్టించుకుంటారు?

scientific reason behind ornaments used by indian women

భారతీయ సంప్రదాయాలలో పెళ్లి అనేది అతి ముఖ్యమైన కార్యక్రమం, మహిళలు పెళ్ళిలో తాళి కట్టించుకోవడంలో సంప్రదాయంతో పాటు ఎంతో సైన్స్ దాగుంది, తాళి అనేది బంగారంతో చేస్తారు, బంగారంతో చేసిన తాళి మెడలో ఉండటం వల్ల దానిలో ఉండే అయస్కాంతత్వ శక్తి కారణంగా గుండె మంచిగా పని చేస్తుంది, అలాగే వారిలో పాల ఉత్త్పతిని మెరుగుపరుస్తుంది. మెడలో తాళి ఉండటం మూలంగా సమాజంలో గౌరవం లబిస్తుంది.

భారతీయ మహిళలు కాలి మెట్టెలు ఎందుకు ధరిస్తారు?

scientific reason behind ornaments used by indian women

భారతీయ మహిళలు వివాహ అనంతరం కాలికి మెట్టెలు ధరిస్తారు. కాలి రెండో వేలికి మెట్టెలను ధరిస్తారు. అలా ధరించడం వెనుక ఒక బలమైన కారణం కూడా ఉంది. కాలి రెండవ వేలు నుండి గర్భాశయం, గుండెకు నిర్దిష్ట నాడులు కలిగి ఉంటాయి. గర్భాశయం ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది. రుతుచక్రం సక్రమంగా జరిగేలా చేస్తుంది. మహిళలు ఎక్కువగా వెండితో చేసిన కాలి మెట్టెలను ధరిస్తారు, సైన్స్ ప్రకారం వెండి మంచి వాహకంగా పనిచేస్తూ మహిళల శరీర ఉష్ణోగ్రతను సమాన స్థాయిలో ఉండే విధంగా చేస్తుంది.అలాగే భూమి నుంచి పోలార్ శక్తుల నుండి శక్తిని గ్రహించి ఆ శక్తి శరీరంనకు వెండి ద్వారా వెళుతుంది. అందువలన మొత్తం శరీరం వ్యవస్థ రిఫ్రెష్ అవుతుంది.

భారతీయ మహిళలు గాజులను ఎందుకు ధరిస్తారు?

scientific reason behind ornaments used by indian women

గాజులకి భారతీయ మహిళలకి ఎంతో సంబంధం ఉంది, మహిళలు గాజులని ధరిచడం ఎంతో గౌరవంగా భావిస్తారు,గాజులను అలంకరణ, ఆభరణ వస్తువులుగా మాత్రమే ఉపయోగించరు. మణికట్టు నుండి ముంజేతికి మధ్య ఉండే నాడులు గర్భాశయ నాడులతో అనుసంధానమై ఉంటాయి. గర్బాశయ నాడులను ఉద్దీపనం చేయడానికి గాజులను ఉపయోగిస్తారు. మణికట్టు దగ్గరగా ఉండే నాడులు ఒత్తిడికి లోనవుతుంటే , గర్భాశయ నాడులు కూడా అందుకు అనుగుణంగా ఉత్తేజితమవుతాయి. దీనివలన గర్బాశయ పనితీరు, కండరాల కదలిక, రక్తప్రసరణ బాగా జరుగుతుంది. సీమంతం అప్పుడు గాజులు తొడగడానికి కారణం…గర్భంలోని పిండం ఎదుగుదలకు గాజుల చప్పుళ్లు ఉపయోగపడతాయట.!

మహిళలు చెవిపోగులు ధరించడం?

scientific reason behind ornaments used by indian women

మహిళలు ధరించే చెవిపోగులు వారిని అందంగా చూపిండమే కాకుండా వారి తెలివిగల నిర్ణయాలకు కారణాలవుతాయట. . చెవిపోగులు ధరించడం వల్ల ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడుతారట, చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారట. అంతే కాకుండా చెవి నాడులు కన్నులకి కనెక్ట్ అయి ఉండటం వల్ల కన్నులు మంచిగా కనిపిస్తాయి.

మహిళలు ముక్కు పుడక ధరించడం?

scientific reason behind ornaments used by indian women

మహిళలు ముక్కుపుడక ధరించడం అనేది ఎంతో పవిత్రమైన కార్యక్రమంగా భావిస్తారు, ముక్క పుడక మహిళలలో రుతుచక్రం సరిగ్గా జరిగేల సహాయ పడుతుంది, అలాగే గర్భాశయం పనితీరుని మెరుగు పరచడంలో కూడా సహాయ పడుతుంది.

(Visited 5,886 times, 1 visits today)