నిన్నటి అందాల రాశి ఐశ్వర్యా రాయ్ పెళ్ళైనా నటనకు స్వస్తీ చెప్పలేదు. కానీ తల్లయ్యాక మాత్రం కూతురైన ఆరాధ్య కోసం తన ఇష్టాన్ని కొన్నాళ్ళు పక్కన పెట్టింది. కొన్నాళ్ళు పాప కోసం సినిమాలకీ, సినీ వాతావరణానికీ దూరంగానే ఉన్న ఐశ్వర్యా రాయ్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెండితెర పై మెరవనున్నారు. సంజయ్ గుప్తా దర్శకత్వం లో ఐశ్వర్యా రాయ్ నటించిన కొత్త సినిమా అక్టోబర్ తొమ్మిదిన విడుదల కానుంది.ఇర్ఫాన్ ఖాన్, శబానా అజ్మి, జకీ ష్రాఫ్ లాంటి హేమాహేమీలంతా ఉన్న ఈ సినిమా లో ఐశ్వర్యా రాయ్ నటన అద్బుతంగా ఉండబోతుందంటున్నారు ” జజ్బా ” యూనిట్ సబ్యులు. ఇందులో ఐశ్వర్యా రాయ్ ఇంతకు ముందులా అందాలొలకబోసే టీనేజ్ గర్ల్ లా కాకుండా. ఒక కిడ్నాప్ కి గురైన పాపకి తల్లిగ కనిపించనుంది ఐశ్వర్యా రాయ్.
ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ కి విశేష స్పందన లభిస్తోంది. ఏ మాత్రం తేడాలేని ఐశ్వర్యా రాయ్ ని చూసి ఆశ్చర్య పోతున్నారు ఆమె అభిమానులు. ఇప్పటికీ వన్నెతగ్గని ఈ అందాల రాశిని చూసి ఎంతైనా ఒకప్పటి ప్రపంచ సుందరి కదా అలాకాక ఇంకెలా ఉంటుందీ అంటూ తమ అభిమాన నటిని మెచ్చుకుంటున్నారు. ఇప్పటికే యూ ట్యూబ్ లో ఈ వీడియో 3,155,594 మంది చూడగా 9573 మంది ఇష్టపడ్డారు. ఐతే ఇన్నాళ్ళ తర్వాత వచ్చిన ఐశ్వర్యా రాయ్ తన ఈ సెకెండ్ ఇన్నింగ్స్ లో ఇక ముందు గ్లామరస్ పాత్రలు చేస్తుందా లేక ఇలా వయసుకు తగ్గ పాత్రల్ని ఎంచుకుంటుందా అన్నది అభిమానులముందున్న ప్రశ్న.