Home / Latest Alajadi / ఖాతాదారులకు చార్జీల మోత మోగిస్తున్న బ్యాంకులు…!!!

ఖాతాదారులకు చార్జీల మోత మోగిస్తున్న బ్యాంకులు…!!!

Author:

బ్యాంకుల నుండి డబ్బులు విత్ డ్రా చేయాలనుకునే ఖాతాదారులకు బ్యాంకులు షాక్ ఇస్తున్నాయి, విత్ డ్రా చేస్తే… ఛార్జీల మోత మోగిస్తున్నాయి. ప్రతి వెయ్యి రూపాయల మీద 5రూపాయలు వసూలు చేస్తున్నాయి, కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఈరోజు నుండే ఈ చార్జీల విధానాన్ని అమలు చేస్తున్నాయి, బ్యాంకు అకౌంట్ నుండి నగదు విత్ డ్రా చేసినా.. డిపాజిట్ చేసినా..నెలలో కేవలం నాలుగు సార్లు మాత్రమే ఉచితంగా చేసుకోవచ్చు. ఆపై అదనంగా జరిగే లావాదేవీలకు ఛార్జీలు ఖచ్చితంగా చెల్లించాల్సిందే. ఈ విధానాన్ని HDFC , ICICI బ్యాంకులు ఈరోజు నుండే అమలులోకి తీసుకవచ్చాయి , మరికొన్ని రోజులలో అన్ని బ్యాంకులు చార్జీల మోత మోగించబోతున్నాయి.

Bank-Deposit-Fee-1

HDFC:

మార్చి ఒకటి నుంచి HDFC బ్యాంకులో జరిపే విత్ డ్రాకు రూ.5 అదనంగా వసూలు చేయనున్నారు. కనీస ఛార్జీ రూ.150గా ఉంది. ఉదాహరణకు నెలకు 2 లక్షల రూపాయలు నాలుగు దశల్లో విత్ డ్రా చేసుంటే.. ఆపై జరిపే అదనపు ట్రాన్సాక్షన్ లో రూ. 50వేలు విత్ డ్రా చేస్తే మొత్తం రూ.2.5లక్షలకు రూ.1250 వసూలు చేస్తారు.

ICICI:

ఐసీఐసీఐ బ్యాంకు కూడా ఇదే దారిలో వెళ్లడానికి రెడీ అవుతోంది. ప్రతి ఐదో డిపాజిట్/ విత్ డ్రాకు మినిమం 150 రూపాయలు వసూలు చేయనుంది. ఆపై జరిగే వాటికి డబ్బును బట్టి ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఇప్పటికే దీనిపై ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

(Visited 2,924 times, 1 visits today)