Home / Latest Alajadi / బోటు ప్రమాదానికి సంబంధించి షాకింగ్ నిజం..!

బోటు ప్రమాదానికి సంబంధించి షాకింగ్ నిజం..!

Author:

డబ్బులు సంపాదించాలనే ఆశతో నిర్లక్ష్యంగా బోటు నడిపి 23 మంది ప్రాణాలు పోవడానికి కారణం అయిన విషాద సంఘటన గురుంచి మరొక షాకింగ్ విషయం తెలిసింది, కాసుల కక్కుర్తితో ఎంత దారుణానికి ఒడిగట్టారో తెలియజేసే ఉదంతంగా దీన్ని చెప్పాలి. ఆదివారం ఇబ్రహీంపట్నం వద్ద ప్రమాదవశాత్తు మునిగిన ఫెర్రీ బోటును ఈరోజు బయటకు తీశారు.

బోటు ప్రమాదం Shocking-Secrets-about-Krishna-River-Boat

23 మంది ప్రాణాలని తీసిన బోటుని ఈరోజు పరిశీలించిన అధికారులకు విస్మయం చెందే నిజం ఒకటి తెలిసింది, ప్రమాదానికి గురైన బోటు..అసలు బోటు కాదు అది సముద్రంలో చేపలు పట్టడానికి ఉపయోగించే పడవ..దానికి కొన్ని మార్పులు చేసి పర్యాటక బోటుగా మార్చేశారు, కాకినాడలో చేపలు పట్టడానికి ఉపయోగించే పడవని కొనుగోలు చేసి పర్యాటకుల లాంచిగా మార్చినట్టుగా అధికారులు తెలిపారు, బోటుని పరిశీలించి పర్యాటక బోటుకి అనుమతి ఇవ్వాల్సిన అధికారులు కాసులకి ఆశపడి చూసీచూడనట్లుగా వ్యవహరించటంతో 23 నిండు ప్రాణాలు జలసమాధి అయ్యాయి. ఇలాంటి పడవలో పది మంది కంటే ఎక్కువ ప్రయాణం చేయకూడదని అధికారులు తెలిపారు.

బోటు ప్రమాదం Shocking-Secrets-about-Krishna-River-Boat

మాములుగా పర్యాటక బోటు లకి అడుగు భాగం ఫ్లాట్ గా ఉంటుందని..అదే చేపల బోటులకి ఫ్లాట్ గా ఉండకుండా అడుగు భాగం కొంచెం ఎక్కువ లోతులోకి ఉంటుందని అందుచేతనే ఈ బోటు నదిలో ఉన్న ఇసుక దిబ్బలని తాకడం వాళ్ళ బోటులో ఉన్నవాళ్ళంతా ఒక్క సైడ్ కి వచ్చేయడంతో ప్రమాదం జరిగిందని, పది మంది ఎక్కాల్సిన బోటులో 40 మంది ఎక్కారని.. ప్రమాదం కానీ మరింత లోతుగా ఉన్న ప్రాంతంలో జరిగి ఉంటే.. ఒక్కరు కూడా బతికి ఉండేవారు కాదన్న విషయాన్ని అధికారులు తెలిపారు, విన్నంతనే ఒళ్లు జలదరించేలా ఉన్న ఈ దారుణం చూస్తే.. కాసుల కక్కుర్తితో అటు వ్యాపారులు.. వారేం చేసినా చూసీచూడనట్లుగా వ్యవహరించే అధికారుల దుర్మార్గం అమాయకుల ప్రాణాలు పోయేలా చేస్తుంది.

(Visited 834 times, 1 visits today)