Home / Latest Alajadi / Video: సింధుని వాలీబాల్ ప్లేయర్ చేసేసిన డిప్యూటీ సీఎం.

Video: సింధుని వాలీబాల్ ప్లేయర్ చేసేసిన డిప్యూటీ సీఎం.

Author:

ఒలింపిక్స్ ఫైనల్స్ లో సిల్వర్ మెడల్ గెలుచుకొని మన దేశానికి ఎంతో పేరు తెచ్చిపెట్టిన పీవీ సింధు గురుంచి ప్రతిఒక్కరికి తెలుసు, దేశ ప్రధాని దగ్గరి నుండి మారుమూల గ్రామాలలో ఉన్న వాళ్ళు కూడా సింధు విజయాన్ని కోరుకున్నారు, ఒలింపిక్ మెడల్ గెలిచిన తరువాత భారతదేశానికి తిరిగి వచ్చిన పీవీ సింధుకి వేల మంది ఎయిర్ పోర్ట్ లోనే స్వాగతం పలికారు, ఎయిర్ పోర్ట్ నుండి లాల్ బహదూర్ స్టేడియం వరకు సింధుని ఊరేగింపుగా తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం తరుపున సత్కరించారు. దేశ ప్రజలంతా బాడ్మింటన్ ప్లేయర్ సింధుని చూసి గర్వపడ్డారు, ఒలింపిక్స్ తరువాత జరిగిన బాడ్మింటన్ టోర్నీలలో కూడా సత్తా చాటి ప్రపంచంలోనే 5 వ ర్యాంక్ లో ఉంది మన సింధు.

PV Sindhu is a Volleyball Player Says Telangana MLA.

పీవీ సింధు ఎవరంటే ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ తెచ్చిన బాడ్మింటన్ ప్లేయర్ అని చిన్నపిల్లాడిని అడిగిన చెప్తారు కానీ మన ఎమ్మెల్యేలకి తెలియదు, ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో AIMIM పార్టీకి చెందిన ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ మాట్లాడుతూ పీవీ సింధు నేషనల్ వాలీబాల్ ప్లేయర్ అని చెప్పాడు, పక్కనున్న తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీని అడిగి మరి పీవీ సింధు వాలీబాల్ ప్లేయర్ అని చెప్పాడు,ఒలింపిక్స్ లో గెలిచినందుకు తెలంగాణ ప్రభుత్వం 1000 గజాల స్థలాన్ని, 5 కోట్ల రూపాయలని బహుమతిగా ఇచ్చింది, సాక్షాత్తు రెవిన్యూ శాఖకి మంత్రిగా ఉన్న మహమూద్ అలీ గారికి పీవీ సింధు గురుంచి తెలియకపోవడం బాధాకరమైన విషయం, ఒలింపిక్స్ లో మెడల్ తెచ్చిన మన రాష్ట్ర ప్లేయర్ ఏ ఆట ఆడుతుందో కూడా తెలియని వారు మనకి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఉన్నారు, ఆ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు కింద వీడియోలో ఉన్నాయి చూడండి.

(Visited 1,196 times, 1 visits today)