Home / Inspiring Stories / రియో ఒలింపిక్స్‌ లో రజత పతకం సాధించిన సింధు.

రియో ఒలింపిక్స్‌ లో రజత పతకం సాధించిన సింధు.

Author:

రియో ఒలింపిక్స్‌ లో భారత్ కి రెండవ పతకం లభించింది. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ లో పి.వి. సింధు రజత పతకం సాధించింది. స్పెయిన్ కి చెందిన ప్రపంచ మొదటి ర్యాంకర్ మారిన్ తో తలపడిన సింధు మంచి ఆటతీరుతో మొదటి సెట్ ని కైవసం చేసుకుంది. కాని రెండవ సెట్ నుండి తేరుకున్న మారిన్ మంచి ఆధిక్యంతో వరుస సెట్లలో సింధుని ఓడించి బంగారు పతకం సాధించింది.

sindhu won silver medal in rio olympics

ఫైనల్ లో ఓడినప్పటికి ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో ఫైనల్ కి చేరిన మొదటి భారతీయ మహిళగా సింధు పేరు రికార్డులలోకి ఎక్కనుంది. సింధు సాధించిన పతకంతో రియో ఒలింపిక్స్‌ లో భారత్ సాధించిన పతకాల సంఖ్య రెండుకు చేరింది. ఫైనల్ మ్యాచులో మొదటి సెట్ ని 21-19 తో గెలిచిన సింధు, రెండవ సెట్ ని  12-21 తో, మూడవ సెట్ ని 15-21 తో కొల్పోయి రజత పతకంతో సరిపెట్టుకుంది. తన అద్భుత ఆటతీరుతో మన దేశానికి రజత పతకం సాధించిన సింధును అందరూ ప్రముఖులు అభినందించారు. రజత పతకధారి సింధు కి మా అలజడి తరపున శుభాకాంక్షలు.

Must Read: దేశం కోసం పోరాడిన చేతులతోనే నేడు బిచ్చం ఎత్తుకుంటున్న సైనికుడు..!

(Visited 344 times, 1 visits today)