తెలుగు చిత్ర పరిశ్రమలో తన స్వర మాధుర్యంతో కోట్ల మంది అభిమానుల గుండెల్ని కొల్లగొట్టిన సింగర్ సునీత. అద్భుతమైన గాత్రం తో పాటు బ్యూటిఫుల్ లుక్స్ ఆమె సొంతం. ఆమెకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. హీరోయిన్లకు అభిమానులు ఉంటారు. కానీ వారిపై అభిమానం తాత్కాలికమే. సింగర్ సునీతకు మాత్రం పర్మినెంట్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఆమెతో సినిమాల్లో నటింపజేయాలని గతంలో చాలా మంది డైరెక్టర్స్ ,ప్రొడ్యుసర్స్ ప్రయత్నించి విరమించారు. అయితే శేకర్ కమ్ముల అనమిక సినిమాలోని ఒక గీతంలో మాత్రం అలా మెరిసి ఇలా మాయమైంది. ఆమెతో ఏదైనా పాత్ర చేయించడానికి టాప్ డైరెక్టర్స్ తమ ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నారు.అయితే తాజాగా తను చేసిన ఒక కామెడీ వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది.
తన ఇంట్లోనే తీసిన ఈ కామెడీ వీడియో ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ చిత్రంలో కోవై సరళ, బ్రమ్మానందంల మధ్య సాగే ఒక కామెడీ సన్నివేశాన్ని అనుకరించి తీసారు. ఈ వీడియోలో సునీత తన అందమైన హావాభావాలతో ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకు ఎలాంటి వీడియోని అప్లోడ్ చేయడానికి ఇష్టపడని సునీత, పలు పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చిన తనకి సినిమాల్లో నటించడం ఇష్టంలేదని సున్నితంగా తిరస్కరించింది. కాని ఈ వీడియోని చూసిన తర్వాత మరికొంత మంది ఆమెని సినిమా లో చాన్స్ ఇస్తామంటు ఇబ్బంది పెడతారనడం లో ఎటువంటి సందేహం లేదు.