Home / Inspiring Stories / కేంద్రీయ విద్యాలయంలో మీ పాపను ఉచితంగా చదివించండి.

కేంద్రీయ విద్యాలయంలో మీ పాపను ఉచితంగా చదివించండి.

Author:

only girl child is entitled to free education in KVఅత్యుత్తమ పాఠశాల విద్యను అందించే కేంద్రీయ విద్యాలయాలకు మన దేశంలో మంచి పేరు ఉంది. దేశవ్యాప్తంగా కేవలం 1100 కేంద్రీయ విద్యాలయ పాఠశాలలు మాత్రమే ఉండడం, కేంద్రీయ విద్యాలయాలు కేవలం కేంద్ర ఉద్యోగుల పిల్లలకు మాత్రమే అన్న అపోహతో చాలా మంది ఈ పాఠశాలలో ప్రవేశానికి ప్రయత్నం చేయరు. కానీ అలాంటి అపోహలన్ని తీర్చడానికి 2016- 2017 సంవత్సరానికి కేంద్రీయ విద్యాలయాల అడ్మిషన్లు ప్రారంభమైన సంధర్భంగా ఆ శాఖ కమిషనర్ అడ్మిషన్స్ అర్హతల గురించి తెలిపారు.

అందులో ఏ ప్రధాన క్రమంలో పాఠశాల సీట్లు కేటాయిస్తారో తెలిపారు. అందరు అనుకున్నట్లు గానే, కేంద్ర ప్రభుత్వ, మరియు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. రెండవ ప్రాధాన్యత కేంద్ర ప్రభుత్వఅటానమస్ ఇన్స్టిట్యూట్ లలో పనిచేసే ఉద్యోగుల పిల్లలకు ఇస్తారు.

మూడు, నాలుగోవ ప్రాధాన్యతలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు, రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన అటానమస్ ఇన్స్టిట్యూట్ లలో పనిచేసే ఉద్యోగుల పిల్లలకు ఇస్తారు. ఇవన్ని పోగా మిగిలిన సీట్లు సాధారణ ప్రజానీకానికి అందుబాటులో ఉంటాయి.

కానీ పైన తెలిపిన ప్రాధాన్యతలో సంబందం లేకుండా ఆడపిల్లల విద్యను ప్రోత్సహించేందుకు స్పెషల్ కెటెగరీ కిందా ఏక సంతానంగా ఉన్న బాలికలకు ఖచ్చిత ప్రవేశం మరియు ఉచిత విద్యను అందించనున్నారు. మీకు ఏక సంతానం ఉండి, ఆ సంతానం కూడా అమ్మాయి ఐతే ఇంకెముంది దగ్గరలోని కేంద్రీయ విద్యాలయంలో మీ పాపను ఉచితంగా చదివించండి.

దీనిపై మరింత సమాచారం కొరకు ఈ రూల్స్ బుక్ చదవండి. http://kvsangathan.nic.in/GeneralDocuments/ADM-14-15.pdf . మరియు మరింత సమాచారం కొరకు ఈ లింక్ చూడండి. https://factly.in/admission-season-a-single-girl-child-is-entitled-to-free-education-in-kendriya-vidyalayas/

(Visited 5,551 times, 1 visits today)