Home / Entertainment / సైజ్ జీరోలో కమల్ హసన్ పాట..!

సైజ్ జీరోలో కమల్ హసన్ పాట..!

Author:

ఆర్య, అనుష్క హీరో హీరోయిన్లుగా వస్తున్న చిత్రం సైజ్ జీరో లో మరో ప్రత్యేకత చోటు చేసుకుంది. అనుష్క ఎంతో కష్ట పడి మరీ 20 కేజీల బరువు పెరిగి మరీ నటించిన ఈ సినిమా టీజర్ ఈ మధ్యనే విడుదలై అందరినీ మెప్పించింది కూడా. ఈ ట్రైలర్ లో అనుష్క బొద్దుగా కనిపిస్తున్నా అందం పెరిగిందే తప్ప ఏ మాత్రం డీ గ్లామరైజ్ గా అనిపించలేదు. చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు గానీ.. ఈ చక్కనమ్మ బరువెక్కినా అందమే అన్నట్టుగా ఉంది. అతిగా తింటూ భారీ కాయం తో అవస్తలు పడే అమ్మాయిలా అనుష్క ఉన్న సీన్లతో కట్ చేసిన ఈ టీజర్లో చీరలోనూ, మోడ్రన్ డ్రెస్సుల్లోనూ అనుష్క భారీ అందాలు చూసిన వాళ్ళంతా నొరెళ్ళ బెట్టారు. అనుష్క అందాన్ని చూసి కళ్ళు తిరిగిన ఆర్య తననెక్కడ డామినేట్  చేస్తుందో అని యాక్టింగ్ లో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాడట.

ఈ సినిమా లో ఒక పడక గది సీన్ ఉందట ఆ సందర్బానికి తగ్గట్టు గా ఉండే పాట కోసం చాలా ట్రై  చేసారట ప్రకాష్ కోవెల మూడి. కానీ ఆయనకి ఇప్పుడు రాయించిన ఏ పాటా సంతృప్తి గా అనిపించక పోవటం తో చివరికి తన ఫేవరెట్ సాంగ్ నే రీమిక్స్ చేసెయ్యాలనుకున్నారట. ఇంతకీ ఆ పాటేంటంటే కమల్ కథానాయకుడు గా వచ్చిన “క్షత్రియ పుత్రుడు” సినిమా లో “సన్నా జాజీ పడకా…” అన్న పాట. కమల్ హసన్ రేవతీ ల కాంబినేషన్ లో ఇళయరాజా కంపోజిషన్ తో వచ్చిన పాట ఇప్పటికీ మనసుకి హత్తుకునే పాటల్లో ముందు వరుసలో ఉంటుంది. చాలా కాలం నుంచీ ప్రకాష్ కోవెల మూడి ఈ పాటకి ఫ్యాన్. దాంతో అసలు ఈ పాటకంటే అద్బుతంగా సూట్ అయ్యే పాట మరోటి లేదు అనుకున్న ప్రకాశ్ వెంటనే హక్కులు తీసేసుకున్నారట. సైజ్ జీరో లోనూ ఆర్య అనుష్క మధ్య ఉన్న బెడ్రూం సీన్లో టీవీలో వస్తున్న “సన్నజాజి పడకా” పాటని చూస్తూ వీళ్ళు డ్రీం లోకి వెళ్ళిపోతారట. అద్బుతమైన సాంగ్ లో ఆర్యా అనుష్క ఎంత రొమాన్స్ పండిస్తారో చూడాలి. ముద్దమందారం లా బొద్దుగా కనిపిస్తున్న అనుష్క సన్నజాజి లో ఎన్ని అందాలు ఒలక బోయనుందో చూడాల్సిందే…

(Visited 114 times, 1 visits today)