Home / health / పీడ‌క‌ల‌లు వ‌స్తున్నాయా? అయితే ఇలా చేయండి…చెడు క‌ల‌ల‌కు చెక్ చెప్పండి, ప్ర‌శాంతంగా ప‌డుకోండి.!!!

పీడ‌క‌ల‌లు వ‌స్తున్నాయా? అయితే ఇలా చేయండి…చెడు క‌ల‌ల‌కు చెక్ చెప్పండి, ప్ర‌శాంతంగా ప‌డుకోండి.!!!

Author:

ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో అనేక ఒత్తిళ్ల మధ్య సతమతమయ్యే సగటు పౌరుడు అనేక రకాల వ్యాధులకు గురవుతున్నాడు. ఈ క్రమంలోనే ఆరోగ్యంపై దృష్టి సారించడం ఒక్కోసారి కష్టతరమవుతోంది. అయితే కింద ఇచ్చిన పలు సింపుల్ టిప్స్‌ను రోజూ పాటిస్తే చక్కని ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. వీటి కోసం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఆయా సమయాల్లో మనం చేసే పనులు, తీసుకునే ఆహారం, నిద్ర తదితర రోజువారీ అంశాలపై కొద్దిగా శ్రద్ధ పెడితే చాలు. ఎంచక్కా మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌టిక : నిద్రించేట‌ప్పుడు దిండు కింద ఒక పటిక బెల్లం ముక్క‌ను పెట్టుకుని నిద్రించండి. దీంతో నిద్ర బాగా ప‌డుతుంది. ప్ర‌శాంతంగా నిద్ర‌పోతారు. ఎలాంటి ఆటంకం క‌ల‌గ‌దు. పీడ‌క‌ల‌లు రావు. పాజిటివ్ ఎన‌ర్జీ ఒంట్లోకి ప్ర‌వేశిస్తుంది. దీంతో అన్ని రుగ్మ‌త‌లు పోతాయి. ముఖ్యంగా దుష్ట శ‌క్తుల బారిన ప‌డ‌కుండా ఉంటారు.

దిండు : నిద్రించేట‌ప్పుడు దిండును బాగా శుభ్రం చేయాలి. ఎలాంటి దుమ్ము, ధూళి ఉండ‌కూడ‌దు. ఇలా చేస్తే నెగెటివ్ ఎన‌ర్జీ పోతుంది. పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది.

Sleep tips 6 steps to better sleep

వెల్లుల్లి : దిండు కింద వెల్లుల్లి రెబ్బ‌లు 3, 4 పెట్టుకుని నిద్రిస్తే ప్ర‌శాంతంగా నిద్ర ప‌డుతుంది. మెద‌డుకు విశ్రాంతి ల‌భిస్తుంది. నిద్ర‌లేమి స‌మ‌స్య దూర‌మ‌వుతుంది. పాజిటివ్ ఎన‌ర్జీ ప్ర‌వేశిస్తుంది.

నిద్రించే దిశ : ఉత్త‌రం వైపు కాళ్లు పెట్టి ద‌క్షిణం వైపు త‌ల‌పెట్టి నిద్రించాలి. ఇలా చేస్తే బాగా నిద్ర ప‌డుతుంది. పీడ క‌ల‌లు రావు.

సోంపు : నిద్రించేట‌ప్పుడు దిండు కింద సోంపు గింజ‌ల‌ను ఉంచుకోవాలి. దీని వ‌ల్ల నెగెటివ్ ఎన‌ర్జీ దూర‌మ‌వుతుంది. నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. బాగా నిద్ర‌పోతారు. నిద్ర‌లేమి స‌మ‌స్య దూర‌మ‌వుతుంది. వాస్తు దోషం ఉంటే పోతుంది.

మిశ్ర‌మం : గోరువెచ్చని నీటితో పాదాల‌ను క‌డ‌గాలి. కొద్దిగా కొబ్బ‌రినూనె తీసుకుని దాంట్లో కొంత క‌ర్పూరం వేసి క‌ల‌పాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని మ‌డ‌మ‌ల‌కు రాయాలి. ఇలా చేసి నిద్రిస్తే హాయిగా ఉంటుంది. చ‌క్క‌గా నిద్ర ప‌డుతుంది.

అయితే ఈ  సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఆఫీసు నుంచి ఇంటికి రాగానే స్నానం చేయాలి. రాత్రి 8 గంటల లోపే భోజనం చేసేసి పడుకోవాలి. వీలైనంత వరకు టీ, కాఫీ, మద్యం, సిగరెట్‌ అలవాట్లను మానేయాలి. ఇక రాత్రి 9 గంటల తర్వాత టీవీ చూడడం, గంటలతరబడి సెల్‌ఫోన్‌తో గడపం మానేయాలి. ప్రతి రోజూ తప్పని సరిగా 6 నుంచి 8 గంటలు నిద్రపోయేలా చూసుకుంటే చ‌క్క‌గా నిద్ర ప‌డుతుంది . కాబట్టి కడుపు నిండా తిండే కాదు.. కంటి నిండా నిద్రా అవసరమే..

(Visited 1 times, 1 visits today)