Home / Gossips / పగటి పూట కాసేపు కునుకు.. మెదడు చురుకు

పగటి పూట కాసేపు కునుకు.. మెదడు చురుకు

Author:

నెల రోజులు తినకుండా అయినా ఉండగలం కానీ 3 రోజుల మించి నిద్ర లేకుండా ఉండలేమన్నది జగమెరిగిన సత్యం. ఇక్కడే అర్థం అవుతుంది ప్రతి మనిషికి నిద్ర యొక్క ఆవశ్యకత. తిండి లేకున్నా శరీరం తట్టుకుంటుంది కానీ నిద్రలేకపోయినా, తగ్గినా శారీరక, మానసిక సమస్యలు పెరిగి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఇబ్బంది పడుతోంది ఈ నిద్రలేమి తోనే.

పగటి పూట నిద్ర మంచిదా? కాదా? ఏళ్లుగా శాస్త్రవేత్తల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. ఎక్కువ సేపు నిద్రపోతే ప్రమాదమేనన్నది కొందరు పరిశోధకుల మాట.

sleeping at desk in afternoon good

అయితే, పగటి పూట ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, పని చేసే ముందు కాసేపు కునుకు తీస్తే మెదడు చురుగ్గా ఉంటుందని వర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌ పరిశోధకులు తెలిపారు. కునుకు వల్ల పనిలో ఏకాగ్రత వస్తుందని వెల్లడించారు.

(Visited 1 times, 1 visits today)