ఇంత బతుకూ బతికి ఇంటెనకాల …..అన్నట్టుగా మారింది పాపం ఆ బీ జె పీ ఎం.పి.గారి పుత్ర రత్నం పరిస్థితి…..కాల్ గర్ల్ ను బుక్ చేసుకుందామని సరదాపడితే, చివరకు లక్షన్నర రూపాయలు పోగొట్టుకునే దురదృష్టం రాసి పెట్టుంది. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, బీ జె పీ ఎం.పి. కన్వర్ సింగ్ తన్వర్ గారి కుమారుడు మహేశ్ సింగ్ తన్వర్ ఓ కాల్ గర్ల్ కోసం ముచ్చట పడి …ఎస్కార్ట్ సర్వీసెస్ కు ఫోన్ చేశాడు. ముంబై లో వారు బస చేసిన హోటల్ కు 16 వ తేదీ రాత్రి ఒంటి గంటకు కారులో చేరుకున్న ఆ ఎస్కార్ట్ సెర్వీసెస్ ముద్దుగుమ్మ -మహేశ్ సింగ్ తన్వర్ను, ఆయన ఫ్రెండ్ ను హోటల్ కిందకు రమ్మని కాల్ చేసింది. ఉత్సాహంగా కిందకు చేరుకున్న వారిద్దరూ ముప్పై వేల రూపాయల అడ్వాన్స్ ఆమెకు ఇచ్చే సమయానికి , కారు డ్రైవర్ సడెన్ గా ఎంట్రీ ఇచ్చాడు. తన్వర్ పొట్ట మీద కత్తి పెట్టి మరీ…వారిద్దరి దగ్గరున్న లక్షన్నర రూపాయల డబ్బులు దోచుకుని కారులో పారిపోయారు. నిందితుల మీద వకోలా పోలీస్ స్టేషన్ లో సెక్షన్ 397 కింద రాబరీ కేసు నమోదైంది.
ఇక్కడ విషయం లక్షన్నర రూపాయలు పొగొట్టుకోవటం కాదు….ప్రముఖ రాజకీయ నాయకుడైన ఎం పీ గారి పరువు పోయింది కదా అని బీ జె పీ శ్రేణులు వాపోతున్నాయి. ఇండియా మొత్తం అదిరిపోయేలా …ఇటీవలే తన మరో కుమారుడి పెండ్లి వేడుకలు నిర్వహించిన కన్వర్ సింగ్ తన్వర్, ఆ పెండ్లి కి ఖర్చు పెట్టింది అక్షరాలా 250 కోట్ల రూపాయలు!
అంటే……దానితో పోలిస్తే లక్షన్నర లెక్క కాదనేది ఎం పీ గారి అనుచరుల మాట. ఏటి సేస్తాం…..సొమ్ములు పోనాయి…..పరువూ పోనాది.
Related Post: ఎవరీ హైదరాబాదీ ? ఏమా కథ?