Home / Videos / Video: గుజరాత్ లో ఘోరం…సేవలు చేయలేక కన్నతల్లినే చంపేశాడు.

Video: గుజరాత్ లో ఘోరం…సేవలు చేయలేక కన్నతల్లినే చంపేశాడు.

Author:

నవమాసాలు మోసి కని పెంచిన కొడుకే ఆ తల్లికి కాలయముడిగా మారి అతి దారుణంగా చంపేశాడు ఓ కిరాతకుడు, ఈ ఘోరం గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ సిటీలో ఉండే ఓ సందీప్ నతవానీ ఒక మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు.ఇతనికి  పెళ్లయ్యింది, తండ్రి ఎప్పుడో చనిపోగా తన తల్లి జయశ్రీని తనతోనే ఉంచుకుంటున్నాడు, సంవత్సరం క్రితం వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న జయశ్రీ.. పక్షవాతంలో మంచం పట్టింది. అన్నీ సేవలు మంచంపైనే చేయాల్సి వస్తుంది. ఈ విషయంలో సందీప్ కి అతని భార్యకి ఎప్పుడు గొడవలు జరిగేవి, సేవలు చేయలేనని.. నువ్వే చేయాలని ఇద్దరి మధ్య ఘర్షణ. తల్లి విషయంలో రోజూ ఇంట్లో గొడవలు జరుగుతుండటం.. తల్లికి ఇక ఎప్పటికీ పూర్తిగా కోలుకునే పరిస్థితి లేకపోవటంతో వదిలించుకోవాలని చూశాడు సందీప్.

son-murdered-mother-in-gujarath

సెప్టెంబర్ 27వ తేదీ తల్లిని బిల్డింగ్ పైకి తీసుకెళ్లాడు. నడవలేని తల్లిని పట్టుకుని మరీ మెట్లు ఎక్కించాడు. పైకి తీసుకెళ్లి కిందకు తోసేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియదన్నట్లు ఇంట్లోకి వచ్చేశాడు. జయశ్రీ బిల్డింగ్ పైనుంచి పడిపోయిందని.. కింద నుంచి వచ్చి ఓ వ్యక్తి తలుపుతట్టి మరీ చెబుతాడు. అప్పుడు కూడా ఏమీ తెలియదన్నట్లు కిందకి పరిగెత్తుతాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా మొదటి కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రమాదవశాత్తు జరిగిందిగా భావించి లైట్ తీసుకున్నారు. జయశ్రీకి ఇద్దరు కూతుళ్లు, ఇతర బంధువులకు డౌట్ వచ్చింది. అమ్మ అసలు నడవలేదు.. అడుగుదీసి అడుగు వేయలేదు.. అలాంటిది బిల్డింగ్ పైకి వెళ్లి ఎలా దూకింది అనే సందేహం వచ్చింది. బిల్డింగ్ టెర్రస్ పై పిట్టగోడ రెండున్నర అడుగుల ఎత్తు ఉంది. నడవలేని ఆమె.. అంతపెద్ద గొడ దాటి ఎలా దూకగలదు అని అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. దీంతో బిల్డింగ్ సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించారు. సమాచారాన్ని పోలీసులకు అందించారు. అందులో సందీప్ స్వయంగా తల్లిని బిల్డింగ్ పైకి తీసుకెళ్లటం.. కిందకి రావటం జరిగింది. అనుమానం బలపడింది. ఆ వెంటనే సందీప్ కూడా హార్ట్ ప్రాబ్లమ్ అంటూ ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. ఇక పోలీసులు కూడా చంపింది కొడుకే అని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆస్పత్రికి నుంచి బయటకు రాగానే అరెస్ట్ చేయటానికి సిద్ధంగా ఉన్నారు.

(Visited 858 times, 1 visits today)