Home / Devotional / శ్రీ రామ నవమి చరిత్ర మరియు ప్రాముఖ్యత.

శ్రీ రామ నవమి చరిత్ర మరియు ప్రాముఖ్యత.

Author:

హిందువు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో శ్రీ రామ నవమి ఒకటి, వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి నాడు జరుపుకునే ఈ పండుగకు చాలా విశిష్టత ఉంది. త్రేతాయుగంలో ఇదే ముహుర్తానికి విష్ణుమూర్తి యొక్క 7 వ అవతారంగా శ్రీ రాముడు జన్మించాడు. అంతే కాకుండా సీతమ్మ తల్లితో శ్రీ రాముడి వివాహం కూడా చైత్ర శుద్ధ నవమినాడే జరిగింది. 14 సంవత్సరాల అరణ్యవాసం తరువాత అయోధ్యలో పట్టాభిషిక్తుడైనది కూడా చైత్ర శుద్ధ నవమి నాడే. అందుకే ఎంతో పవిత్రమైన, విశిష్టమైన ఆ రోజును శ్రీ రామ నవమి పర్వదినంగా జరుపుకుంటారు భక్తులు.

sri rama navami

శ్రీ రామ నవమి సంధర్భంగా అన్ని ఆలయాలలోను చలువ పందిళ్ళు వేసి సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా చేస్తారు. సీతారాముల కళ్యాణాన్ని వీక్షించడానికి విచ్చేసిన భక్తులకు మిరియాలు వేసిన పానకము, వడ పప్పు ప్రసాదంగా ఇస్తారు అంతే కాకుండా సీతారాముల కళ్యాణం లో వాడిన తలంబ్రాలని భక్తులకు పంచుతారు. ఆ తలంబ్రాలను తమ పూజ గదిలో పెట్టుకుంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. పురాణాల ప్రకారం కోదండ రాముని వివాహానికి సామాన్య ప్రజలే కాదు దేవతలు కూడా దివి నుంచి భువికి దిగివస్తారని ఉవాచ. అత్యంత విశిష్టమైన రాముల వారి కళ్యాణాన్ని వీక్షించిన కనులు దన్యమవుతాయి అందుకే రేపు దగ్గరలోని ఆలాయానికి వెళ్ళి స్వామి వారి కళ్యాణాన్ని కనులార తిలకించండి. భక్తులందరికి శ్రీ నామ నవమి శుభాకాంక్షలు.

(Visited 482 times, 1 visits today)