Home / Reviews / శ్రీమంతుడు

శ్రీమంతుడు

శ్రీమంతుడు సినిమా రివ్యూ

Alajadi Rating

3.75/5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: మహేష్ బాబు, శృతి హసన్, రాజేంద్రప్రసాద్, జగపతి బాబు, సంపత్ రాజ్

Directed by: కొరటాల శివ

Produced by: Y. నవీన్ , రవి శంకర్ , C.V. మోహన్

Banner: మైత్రి మూవీ మేకర్స్, MB ఎంటర్టైన్మెంట్ Pvt. Ltd

Music Composed by: దేవి శ్రీ ప్రసాద్

సూపర్ స్టార్ ప్రిన్స్ మహెష్ బాబు మిర్చి ఫేం కొరటాల షివ డైరెక్షన్, అందాల శ్రుతి హాసన్ ఇవన్నీ కలిపి జనాల్లో మాంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్న శ్రీమంతుడుసినిమా పిచ్చ హైప్ తో రిలీజ్ అయింది. ఇప్పటికే టీజర్స్ లో మహేష్ క్లాస్ అండ్ మాస్ లుక్స్ తో అదరగొట్టాడు. టీజర్స్ లో కూడా కతలోని ఇంట్రస్ట్ జనాల్లో హైప్ క్రియెట్ చెసింది మరి మహెష్ నిజంగా శ్రిమంతుడో కాదో చూద్దాం..

కథ :

శ్రీమంతుడు సినిమా టైటిల్ కి తగ్గట్టుగానే హీరో హర్ష (మహేష్ బాబు) ఓ రిచ్ కిడ్. తండ్రి పాత్ర రవికాంత్ (జగపతిబాబు) పేద్ద బిజినెస్ మాన్.కావల్సినంత డబ్బు, ఫేమ్, నెంబర్ 1 స్టేటస్ ఇలా అన్నీ ఉన్నా హీరోకి ఏవీ సంతోషాన్ని ఇవ్వవు. తనకి కావాల్సింది ఇంకేదో ఉందని వెతుకుతూ ఉంటాడు. హర్షని ఫాదర్ తన బిజినెస్ చూసుకోమంటే తనకు ఇష్టం లేదని తనకు నచ్చింది చేస్తూ తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ తెచ్చుకోవాలని చెబుతాడు. తనకి ఏం కావాలా అని ఆలోచిస్తున్న సమయంలో చారుశీల(శృతి హాసన్)ని చూసి ఇష్టపడుతాడు. కొద్ది రోజుల్లోనే వీరిద్దరి మధ్యా  ప్రేమగా మారడం చకచకా జరిగిపోతాయి. కానీ చారుశీల మాత్రం హర్ష ప్రేమని రిజెక్ట్ చేస్తుంది. దానికి కారణం రవికాంత్ తన సొంత ఊరు అయిన దేవర కోటని మరచిపోవడం. అప్పటి వరకూ తన ఊరి గురించి తెలియని హర్ష అక్కడికి వెళ్లి దాని గురించి తెలుసుకొని ఆ ఊరిని దత్తత తీసుకొని దాన్ని డెవలప్ చెయ్యాలని చూస్తాడు. కానీ ఊరిని తమ కంట్రోల్ లో ఉంచుకొని, తాము చెప్పినట్టే జరగాలనుకునే వెంకటరత్నం(ముఖేష్ రుషి), శశి(సంపత్), రాధ(హరీష్)లు హర్షద్ కి ప్రతి పనిలోనూ అడ్డుతగులుతూ ఉంటారు. ఈ గొడవల్లో హర్ష తనకు బాగా దగ్గరైన వారిని కోల్పోవడమే కాకుండా ఆ ఊరికి తన ఫ్యామిలీకి ఉన్న రిలేషన్ గురించి తెలిసి షాక్ అవుతాడు. అక్కడి నుంచి ఏం చేసి  ఆ ఊరిని డెవలప్ చేసాడు.? తనవాల్లని ఎలా కాపాడుకున్నాడు అనేదే అసలు కథ.

అలజడి ఎనాలిసిస్:

ఈ సినిమాకి కెప్టెన్ ఆఫ్ ది షిప్ ప్లస్  సినిమాకి కీలకమైన కథ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం లాంటి విభాగాలను డీల్ చేసిన కొరటాల శివ విషయానికి వద్దాం.. కొరటాల శివ మిర్చి స్టైల్ లోనే ‘మా ఊరు నాకు చాలా ఇచ్చింది.. ఎంతో కొంత తిరిగిచ్చేయాలి.. లేకపోతే లావైపోతాను’ అనే పాయింట్ ని తీసుకొని ఓ సోషల్ మెసేజ్ తో ఈ స్టొరీ లైన్ రాసుకున్నాడు. కానీ సినిమాని ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల చెప్తే ఫ్లాప్ అవ్వుద్ది.. సో దాన్ని కమర్షియల్ ఫార్మాట్ లో చెప్పాలని కథని డెవలప్  చేసాడు.స్టొరీ లైన్ ని కొత్తగా ఎంచుకున్న కొరటాల శివ పూర్తి కథని మాత్రం రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో రాసుకోవడంతో కొత్తే. సినిమాని బాగా హాండిల్ చేసాడు కానీ సెకండాఫ్లో ఆడియన్స్ బాగా రొటీన్ గా ఫీలవుతారు. వీటన్నిటికి తోడు సినిమాని 2 గంటల 43 నిమిషాలు ఉండడం కాస్త మైనస్. మొదటి సినిమా మిర్చిలో హీరో పాత్ర చుట్టూనే ఓ తెలియని ఫన్ ని క్రియేట్ చేసుకుంటూ కథని రాసుకొచ్చాడు. కానీ ఈ సినిమాలో ఆ యాంగిల్ ని పూర్తిగా మిస్ చేసాడు. కథ,కథనాలు కొంచం సీరియస్ మోడ్ లోనే ఉన్నయి ఈ సినిమాలో. ఇక కొరటాల డైలాగ్స్ డీసెంట్ గా ఉన్నాయి. దర్శకత్వం కూడా పరవాలేదనిపించింది. కొరటాల సక్సెస్ అయ్యింది ఒక్క దగ్గరే.. అదెక్కడ అంటే రాసుకున్న కొన్ని యాక్షన్, ఎమోషనల్ సీన్స్ ని బాగా తీయడంలో.. ఓవరాల్ గా కొరటాల శివ ద్వితీయ విజ్ఞాన్ని సక్సెస్ఫుల్ గా క్రాస్ చేసినట్టే. ఇక సినిమాకి హైలైట్స్ గా నిలిచిన వాటి గురించి చెప్పుకొస్తే మది సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్బ్. ముఖ్యంగా మహేష్ బాబుని చూపించిన విధానం మాత్రం అభిమానులకు మంచి కిక్ ఇస్తుంది. ఇక తనకి ఇచ్చిన ప్రతి లొకేషన్ ని అద్భుతః అనే రేంజ్ లో చూపించాడు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన పాటల కన్నా పిక్చరైజేషన్ బాగా ఆకట్టుకుంది. అనల్ అరసు యాక్షన్ ఎపిసోడ్స్ డీసెంట్ గా ఉన్నాయి. అక్షయ్ త్యాగి కాస్ట్యూమ్స్ అదుర్స్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

రెండు వరుస ఫ్లాప్ సినిమాల తర్వాత మహేష్ బాబు అభిమానులు హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వారి అంచనాలకు తగ్గాట్టు గానే, వారు ఎదురు చూస్తున్న హిట్ దాహాన్ని తీర్చే సినిమా ‘ శ్రీమంతుడు ‘. కొరటాల శివ మహేష్ బాబు సినిమా అనగానే ఓ సోషల్ మెసేజ్ ఉన్న స్ట్రాంగ్ స్టొరీ లైన్ ని ఎంచుకున్నాడు కానీ దానిని కమర్షియల్ గా చెప్పాలనుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మహేష్ బాబు వన్ మాన్ షో. మహేష్ ఒక్కడే ఈ సినిమాని పూర్తిగా నడిపించే బాధ్యతను తీసుకోవడమే కాకుండా తన పార్ట్ ని సమర్ధవంతంగా నిర్వర్తించాడు. మహేష్ బాబు పాత్ర చాలా కొత్తగా ఉండడమే కాకుండా, ఆ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. మొదట్లో సంతృప్తిగాలేని ఓ రిచ్ కిడ్ గా, ఆ తర్వాత హన్డ్సం కాలేజ్ స్టూడెంట్ గా, ఆ తర్వాత ఊరిని డెవలప్ చేసే యువకుడిగా, ఆ తర్వాత ఫ్యామిలీ బాధ్యతని తీసుకొనే కొడుకుగా.. ఇలా ఇన్ని వేరియేషన్స్ ని చాలా పర్ఫెక్ట్ గా చూపించాడు మహేష్. ఇన్ని వేరియేషన్స్ లో తన లుక్ ని కూడా మార్చుకుంటూ వచ్చిన విధానం సూపర్. చారుశీల సాంగ్ లో మైఖేల్ జాక్సన్ స్టెప్స్ ని వేసిన తీరు బాగుంది. శృతి హాసన్ క్యూట్ లుక్స్ మరియు డీసెంట్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. పాటల్లో అయితే బాగా గ్లామరస్ గా కనిపించి అందాలతోనూ ఆకట్టుకుంది. జగపతి బాబు – రాజేంద్ర ప్రసాద్ ల పాత్రలు ఈ సినిమాకి చాలా కీలకం, వారి పాత్రల్లో వారు మంచి నటనని కనబరచడమే కాకుండా.. సినిమాలో ఎమోషనల్ డెప్త్ ని తీసుకువచ్చారు. విలన్ గా సంపత్, హరీష్, ముఖేష్ రుషిలు హీరోకి గట్టి పోటీని ఇచ్చారు. ఇక సినిమాలో కొన్ని ముఖ్య పాత్రల్లో నటించిన సుకన్య, వెన్నెల కిషోర్లు తమ పాత్రల పరిధిమేర నటించి వెళ్ళిపోయారు. అయితే సినిమా అంతా బాగున్నా క్లైమక్స్ మాత్రం సడంగా హర్రీ బర్రీగా తీసినత్తేసి కాస్త నిరాశకు గురి చేస్తుంది. ఒవరాల్ గా ఇలాంటి ప్రయోగం చేసిన మహేష్ ని అభినందించాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

  • మహేష్, శ్రుతి
  • కెమెరా వర్క్
  • సినిమా తీసిన విదానం
  • సాంగ్స్ అండ్ ఫైట్స్

మైనస్ పాయింట్స్:

  • కొంచం స్లో నారేషన్
  • స్పీడీ క్లైమక్స్
(Visited 208 times, 1 visits today)