Home / Inspiring Stories / మానవ సంబంధాలను టెక్నాలజీతో కొనగలమా?

మానవ సంబంధాలను టెక్నాలజీతో కొనగలమా?

Author:

మారిన పరిస్థితుల కారణంగా ప్రతి మనీషికి ఉన్న చోటనే అన్నీ సమాకురుతున్న వేళ, మనిషి డబ్బుతో కొన్నవాటిని ప్రేమిస్తున్నాడు, వెలెకట్టలేనంత ప్రేమను పంచే తోటి వారిని ఎలా విస్మరిస్తున్నాడో తెలిపే చిన్న కధ. ” ప్రదీప్ వాళ్ళ మామగారి ఊరు వెళ్ళాడు. అక్కడ ప్రదీప్ వాళ్ళ మామ బ్యాంకు కి వెడుతూ నువ్వూ వస్తావా అని అల్లుడిని అడిగారు. పొద్దుటే అత్తగారు చేసిపెట్టిన అల్లం పెసరట్టు కడుపులో బరువు గా ఉండడం తో అది అరుగుతుంది కదా అని మామతో కలిసి బయలుదేరాడు ప్రదీప్. ఇద్దరూ కాలి నడకన దగ్గరలోనే ఉన్న బ్యాంకు కి వెళ్ళారు అక్కడ ఆయన ఫారం తీసుకుని నింపి డబ్బు విత్ డ్రా చేసి , మళ్ళీ ఫారం నింపి ఎవరికో డబ్బు పంపుతున్నారు. అది అంతా అవ్వడానికి సుమారు ఒక గంట పట్టింది ఈ లోగా పాపం ప్రదీప్ కి కడుపులో గుడ గుడ ప్రారంభం అయ్యింది కొంచెం అసహనంగా ఉన్నాడు. పక్కన కూర్చున్న మామ గారితో ” మీరు ఇలా ఇక్కడ ఇంత సేపు కష్ట పడడం ఎందుకండీ ? ఆన్ లైన్ బ్యాంకింగ్ సదుపాయం ఉంది కదా ?” అన్నాడు … ఎందుకు అది ? ఏమిటి ప్రయోజనం ? అడిగారు ప్రదీప్ మామగారు, తన కడుపులో గుడ గుడలు ఇబ్బంది పెడుతున్నా ప్రదీప్ ఇలా చెప్పడం మొదలు పెట్టాడు…. మీరు ఆన్ లైన్ బ్యాంకింగ్ మొదలు పెట్టారనుకోండి ఇంటి దగ్గర నుండే మీరు అన్ని బిల్లులూ కట్టేయ్యోచ్చు, డబ్బులు ట్రాన్స్ఫర్ చెయ్యొచ్చు అంతెందుకు ? మీకు కావలసిన వస్తువులు అన్నీ అమెజాన్ ద్వారా ఇల్లు కదలకుండా తెప్పించుకోవచ్చు అన్నాడు.

message on human relationships

అపుడు వాళ్ళ మామగారు, ఇవాళ ఇక్కడకి వచ్చాక నేను నా పాత మిత్రులను నలుగురిని కలిశాను చూశావు కదా బాబూ… బ్యాంకు స్టాఫ్ తో కూడా నాలుగు మాటలు మాట్లాడాను ఇక్కడకి రావడానికి ఇంటి దగ్గర ఒక అరగంట ముందు తయారయ్యాను . దారిలో తెలిసిన వారికి హాయ్ చెప్పాను . ఇంకో సంగతి , మొన్న మీ అత్త గారు కిరాణా షాప్ కి వెడుతూ దారిలో పడిపోయింది. అపుడు ఆ కిరాణా షాప్ వాడు ఆటో కట్టించి మీ అత్తగారిని ముందు డాక్టర్ దగ్గరకీ తర్వాత ఇంటికీ తీసుకు వచ్చాడు. ఆ షాప్ కి వెళ్ళీ అతనికి కృతజ్ఞతలు చెప్పాను. మా ఇద్దరూ అబ్బాయిలు మాకు వాట్సప్ ఫోటోలు పంపుతూ దూరంగానే ఉన్నారు కాని మాకు మానవ సంబంధాలు కావాలి బాబు, ఆన్ లైన్ బంధాలు కాదు. టెక్నాలజీ తప్పు కాదు. ఇంట్లోనే ఉండి అన్ని పనులూ చేసేసుకుంటే ఈ వృద్ధాప్యం లో మాకు మానవులతో టచ్ ఎలా ఉంటుంది బాబూ? మేము ఎదురు చూసేది వాటి కోసమే కదా !

కిందటి ఏడాది నేను జబ్బు పడితే నేను ఎప్పుడూ పండ్లు కొనే షాప్ వాడు నా గురించి వాకబు చేసి ఇంటికి వచ్చి నన్ను చూసి ఏడ్చాడు, మాకు పేపర్ వేసే అబ్బాయి రోజూ పాలు తెచ్చి పెట్టేవాడు. కావలసిన సామాను రిక్షా అబ్బాయి తెచ్చి పెట్టేవాడు. ఈ సంబంధాలన్నీ అమెజాన్ తెచ్చి పెట్టగలదా ? నేను నా కంప్యూటర్ తో మాత్రమే సంబంధం పెట్ట్టుకుంటే ఇవి నాకు దక్కుతాయా ? మానవ సంబందాలకంటే విలువైన ఆస్తి ఈ ప్రపంచంలో మరేది లేదు అని చెప్పడంతో ప్రదీప్ కి మానవ సంబంధాల గొప్పతనం తెలిసింది. వాట్సాప్ లో బాగా ట్రెండ్ అవుతున్న ఈ కధలో నిజం దాగి ఉంది.

(Visited 527 times, 1 visits today)