Home / Inspiring Stories / సాఫ్ట్ వేర్ జాబు వదిలేసి, వ్యవసాయం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు.

సాఫ్ట్ వేర్ జాబు వదిలేసి, వ్యవసాయం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు.

Author:

కష్టించే తత్వం,పట్టుదల ఉంటే చాలు ఎలాంటి పనిలో అయిన సక్సెస్ కావచ్చని నిరూపించాడు బెంగుళూరుకి చెందినా సాఫ్ట్ వేర్ ఉద్యోగి మధుచందన్, మధుచందన్ ఊరు మాండ్య, బెంగుళూరుకి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, ఆ ఊరిలో అందరికి వ్యవసాయం చేయడం తప్ప ఇంకో పని రాదు, వర్షాలు లేక పంటలు సరిగ్గా పండలేదని ఆ ఊర్లో చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, ఈ ఘటన అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న మధుచందన్ ని కదిలించింది, తన గ్రామంలో రైతులు పడుతున్న అవస్థలను, దీన స్థితిలో ఉన్న వ్యవసాయాన్ని చూసి మనసు చలించగా, చేస్తున్న జాబ్‌ ని లక్షల్లో వచ్చే జీతాన్ని వదిలేసి రైతులను ఆర్థికంగా ప్రగతి బాటలో నడిపించాలని కంకణం కట్టుకున్నాడు.వచ్చీ రాగానే రైతుల బాధలను మరింత కూలంకషంగా తెలుసుకున్నాడు. అప్పుల బాధలు, పంటలు సరిగ్గా పండకపోవడం, పండినా గిట్టుబాటు ధర లేకపోవడం, వర్షపాతం తగ్గడం తదితర కారణాలతో దీనావస్థకు చేరుకున్న రైతు కుటుంబాలను గమనించాడు. దీంతో వారిని సంక్షేమం దిశగా నడిపించడం కోసం, ఆర్థికంగా ఎదిగేలా చేసేందుకు పూనుకున్నాడు. ఈ సందర్భంలో రైతులు చాలా మంది ఆర్గానిక్ పద్దతుల వ్యవసాయంపై వైపు మళ్లడం గమనించారు మధుచందన్. అయితే వారికి తమ ఉత్పత్తులను అమ్ముకునే మార్గం తెలియక.. సరైన ధర లభించక నష్టపోతున్న వైనాన్నీ గుర్తించారు. అందుకే మరింతమంది రైతులను అర్గానిక్ వ్యవసాయం వైపు ప్రొత్సహించి… వారి ఉత్పత్తులకు మంచి ధర కల్పించాలని సంకల్పించాడు. ఆ ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్నదే ఆర్గానిక్ మాండ్యా.

Organic Mandya

ఆర్గానిక్ మండ్య ఆలోచన వచ్చిన వెంటనే  మధుచందన్ తన తన పాతమిత్రులు, కొలిగ్స్ ను సంప్రదించి దాదాపు రూ.1కోటి నిధులను సేకరించాడు. దాంతోనే  మండ్య ఆర్గానిక్ ఫార్మర్స్ కో ఆపరేటివ్ సొసైటీ అనే సంస్థను స్థాపించాడు. దీనికి తోడు ఆర్గానిక్ మండ్య అనే బ్రాండ్‌ను కూడా రిజిస్టర్ చేశాడు. ఈ సొసైటీ ఆధ్వర్యంలో మండ్య గ్రామంలో నివసించే 240 మంది రైతులకు ఆర్గానిక్ వ్యవసాయం పట్ల మెళకులను, సూచనలపై అవగాహనను మధుచందన్ కల్పించి వారితో  ఆర్గానిక్ వ్యవసాయం పద్ధతిలో పంటలను పండించేవారు. ఇలా పండిన పంటలను నేరుగా రైతులే వినియోగదారులకి అమ్మేట్లుగా ఆర్గానిక్ మండ్య అనే షాప్‌ను బెంగుళూరు-మైసూర్ హైవే పక్కన ఏర్పాటు చేశాడు.దానికి అనుబంధంగా ఆర్గానిక్ రెస్టరెంట్ ని కూడా  ప్రారంభించారు, తమ రైతుల ఉత్పత్తులు ఆ రహదారి గుండా పోయేవారిని ఖచ్చితంగా ఆకర్షిస్తాయని మధుచందన్ కు తెలుసు. అయితే ముందుగా హోటల్లో ఆర్గానిక్ ఉత్పత్తుల రుచి చూసి.. ఆ తర్వాత షాపులో ఉత్పత్తులు కొనుగోలు చేస్తారని భావించారు. ఆశ్చర్యంగా వారంలోనే రెస్టరెంట్ కన్నా.. షాపుకే గారాకీ పెరిగింది. కొంత మంది వినియోగదారులు ఆర్గానిక్ మాండ్యా ఉత్పత్తుల కోసమే బెంగళూరు నుంచి వస్తున్నామని చెప్పడం.. మధుచందన్ లో ఆత్మవిశ్వాసం మరింత పెంచింది.

Organic Mandya Store

మాండ్య ఆర్గానిక్ స్టోర్, రెస్టారెంట్ ప్రారంభించిన 4 నెలలోనే కోటి రూపాయల బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది,ఇప్పుడు ఈ మధుచందన్ ప్రారంభించిన ఆర్గానిక్ కో-ఆపరేటివ్ సొసైటీలో ఐదు వందల మంది రైతులు ఉన్నారు. అందరూ కలిసి దాదాపుగా రెండు వందల ఎకరాల్లో ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు. 70 రకాల ఉత్పత్తుల్ని పండిస్తున్నారు. బియ్యం, పప్పులతో పాటు ఎడిబుల్ ఆయిల్స్, మసాలాలు, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కూడా ఆర్గానిక్ పద్దతిలో సాగు చేస్తున్నారు. మంత్లీ బాస్కెట్ ను రూ.999, రూ.1499, రూ.1999 ధరల్లో అందిస్తున్నారు.

Madhuchandan Organic Mandya

అయితే మధుచందన్ ఇంకా అంతటితో ఆగలేదు. నగరవాసులకు, రైతులకు మధ్య అనుసంధానం పెంచడం కోసం ఆర్గానిక్ టూరిజం అనే కొత్త కార్యక్రమానికి మధు శ్రీకారం చుట్టాడు. దీని ద్వారా నగరవాసులు ఆర్గానిక్ వ్యవసాయం గురించిన విషయాలు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. దీంతో పాటు నగరవాసులు వాలంటీర్లుగా మారి రైతుల పొలాల్లో పనిచేసేందుకు వీలు కలగుతుంది. ఇది రైతులకు కూడా ఉపయోగపడుతుంది. ఇదే కాక స్వెట్ డొనేషన్ క్యాంపెయిన్ అనే మరో కార్యక్రమాన్ని కూడా బెంగుళూరు నగరంలో మధు ప్రారంభించాడు. ఇది వేయి మంది వాలంటీర్లను ఆకర్షించేందుకు ఉపయోగపడింది. ఫామ్ షేర్ అనే మరో వినూత్న ప్రయోగంతో నగరవాసులను ఆర్గానిక్ వ్యవసాయంలో భాగస్వాములను చేసేవాడు. దీని వల్ల నగరవాసులు మండ్య గ్రామంలో అర ఎకరం నుంచి 2 ఎకరాల వరకు భూమిని రూ.35వేలకు అద్దెగా తీసుకుని దాంట్లో తమ సొంత ఆహారాన్ని పండించేందుకు వీలు కలుగుతుంది. ఇలా వారు ఇచ్చే అద్దె మొత్తంలో కొంత భాగం వారికి సహాయం అందించే రైతుకు వెళ్లేది. అయితే  నగరవాసులు అలా పండించిన పంటలను మండ్య షాప్‌కు విక్రయించేలా వీలు కల్పించారు. లేదంటే తమతోపాటు తీసుకెళ్లవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ తరహా కార్యక్రమాలు నగర వాసుల్లో వ్యవసాయం పట్ల ఆసక్తిని కలిగించేవి. దీనికి తోడు రైతులకు ఎంతో కొంత ఆదాయం కూడా వచ్చేది.

Madhuchandan Organic Mandya

 ఇలా మధు దాదాపు 10వేల కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కల్పించాడు. ఈ నేపథ్యంలోనే ఆ రైతులంతా దాదాపు రూ.30 కోట్ల ఆదాయాన్ని తీసుకువచ్చేందుకు చర్యలు ప్రారంభించారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వ్యాపార దక్షత, కష్టించే తత్వం ఉన్న రైతులు ఉంటే ఆర్గానిక్ మండ్య లాంటి గ్రామాలను ఎన్నింటినో తీర్చిదిద్దవచ్చని నిరూపించాడు మధుచందన్. మీరు కూడా ఎప్పుడైనా ఆ హైవేకు వెళ్తే ఒక్కసారి ఆర్గానిక్ మండ్య షాపును సందర్శించండి. వీలైతే ఆ గ్రామంలో అవలంబిస్తున్న ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతులను పరిశీలించండి.

(Visited 4,151 times, 1 visits today)