Home / Inspiring Stories / రాత్రి పది గంటల తరువాత ఈ శివాలయంలో ఎవరు ఉండలేరు, అదృశ్యమౌతుంది..!

రాత్రి పది గంటల తరువాత ఈ శివాలయంలో ఎవరు ఉండలేరు, అదృశ్యమౌతుంది..!

Author:

మన దేశంలో పూర్వకాలంలో కట్టించిన ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర ఉంటుంది, ఆ కాలంలో ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేకున్నా ఇప్పటి టెక్నాలజీకి సైతం సాధ్యం కానీ రీతిలో నిర్మాణాలని కట్టించారు, ముఖ్యంగా ఆలయాలని చాలా అద్భుతంగా చరిత్రకి అద్దంపట్టే విధంగా తీర్చిదిద్దారు.

కానీ గుజరాత్ ఉన్న ఒక ఆలయానికి ఉన్న ప్రత్యేకత ప్రపంచంలోనే వేరే కట్టడానికి లేదు, గుజరాత్ రాష్ట్రంలో భావనగర్ పట్టణానికి దగ్గర్లో ఉన్న కోలియాక్ గ్రామంలో ఒక శివాలయం ఉంది, ఈ ఆలయం పేరు నిష్కళంక మహాదేవ ఆలయం, సాధారణంగా ఎక్కడైనా పూర్వకాలపు ఆలయాలు కొండల పై లేదా గుహలలో లేదా అడవులలో ఉంటాయి కానీ ఈ శివాలయం సముద్రంలో ఉంది, ఈ ఆలయాన్ని ఎప్పుడు పడితే అప్పుడు సందర్శించలేము, కేవలం మధ్యాహ్నం నుండి సాయంత్రం సమయంలోనే ఈ శివాలయాన్ని సందర్శించాలి.

Nishkalanka-Mahadev-Temple-నిష్కళంక మహాదేవ ఆలయం

ఈ ఆలయం సముద్ర తీరం నుండి 2 కిలోమీటర్ల లోపలకి ఉంటుంది, మధ్యాహ్నం 1 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఈ ఆలయం కనిపిస్తుంది, ఆటు పోటుల (చంద్రుని వల్ల సముద్రంలో వచ్చే మార్పులు) వల్ల సముద్రం లోపలకి వెళ్ళినప్పుడు భక్తులందరూ ఆలయం దగ్గరికి వెళ్లి పూజలు చేస్తారు తిరిగి సాయంత్రం సముద్రం మళ్ళీ మాములు స్థితికి వచ్చేలోపు బయటకు వచ్చేస్తారు, మిగిలిన సమయంలో ఈ ఆలయం సముద్రంలో పూర్తిగా మునిగిపోయి ఉంటుంది, ఆలయం మునిగినప్పుడు ఆలయానికి గుర్తుగా ధ్వజస్తంభంకి కట్టిన ఒక జెండా మాత్రమే కనిపిస్తుంది, ధ్వజస్తంభం ఎత్తు దాదాపు 20 మీటర్లు. అంటే దాదాపు ఆ ఎత్తువరకు నీళ్లు వచ్చేస్తాయి.కొన్ని వందల ఏళ్ళుగా ఇక్కడ ఇలాగే జరుగుతోందట. ఇదే ఈ శివాలయానికి ఉన్న ప్రత్యేకత.

Nishkalanka-Mahadev-Temple-నిష్కళంక మహాదేవ ఆలయం

Nishkalanka-Mahadev-Temple-నిష్కళంక మహాదేవ ఆలయం


పౌర్ణమి సమయంలో ఈ ఆలయం ఎక్కువసేపు కనిపిస్తుంది, స్థల పురాణం ప్రకారం ఈ ఆలయాన్ని మహాభారత యుద్ధం తరువాత పాండవులు కట్టించారు అని చెబుతారు, శివరాత్రి సందర్భంలో ఈ నిష్కళంక మహాదేవ ఆలయం దగ్గర చాలా పెద్ద జాతరని నిర్వహిస్తారు, ఇలా సైన్స్ కి , ఆధ్యాత్మికతకి ముడిపెడుతూ చాలా ఆలయాలని ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లోనే  సముద్రంలో వచ్చే ఆటు,పోటుల సమయాన్ని లెక్కించి, సముద్రపు అలలకి తట్టుకునేలా, సముద్రంలో మునిగిపోవడం వల్ల ఆ నిర్మాణానికి ఏమి కాకుండా ఈ శివాలయాన్ని నిర్మించారు అంటే అది చాలా గొప్ప విషయం, ఈ రోజుల్లో మనం కట్టించిన నిర్మాణాలు తొందరలోనే పగుళ్లు వచ్చి పాడైపోతున్నాయి, కొన్ని వందల సంవత్సరాల నుండి ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉన్న ఈ శివాలయం మన పూర్వీకుల గొప్పతనాన్ని తెలియజేస్తుంది.

Must Read: శివపార్వతుల వివాహం జరిగింది ఇక్కడే !, ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటే భార్యాభర్తల మధ్య సమస్యలే ఉండవు.

(Visited 17,219 times, 1 visits today)