Home / Inspiring Stories / మన దేశంలో ఆదివారం రోజు సెలవు దినంగా ఎలా వచ్చిందో తెలుసా..?

మన దేశంలో ఆదివారం రోజు సెలవు దినంగా ఎలా వచ్చిందో తెలుసా..?

Author:

ఇప్పుడు వారం రోజులు కష్టపడుతూ ఆదివారం ఇప్పుడు వస్తుందా..? అని ఎదురుచూస్తుంటాం..! కాని ఒకప్పుడు మన దేశంలో వారంలో ఏడు రోజులు పని దినాలుగా ఉండేవి, బ్రిటిష్ వారి కాలంలో “నారాయణ మేఘాజీ లోఖండే” అనే మహా పురుషుడి 8 ఏళ్ల పోరాటం కారణంగా ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించారు.

Narayan-Meghaji-Lokhande-Stamp

నారాయణ మేఘాజి, జ్యోతిరావు పూలే గారితో కలిసి ఉద్యమాలు చేసేవారు, కార్మిక నాయకుడిగా ఉంది కార్మికులకి వారంలో ఒక రోజు సెలవు దినంగా ఉండాలని బ్రిటిష్ వారితో పోరాటం చేసారు, వారం రోజులు బ్రిటిష్ వారి దగ్గర వెట్టి చాకిరి చేయడానికే సరిపోతుంది, కుటుంబం గురుంచి, సమాజం గురుంచి ఆలోచించడానికి సమయం దొరకట్లేదని అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని వారంలో ఒక రోజు సెలవు కావాలనే ప్రస్తావన 1881 లో బ్రిటిష్ ప్రభుత్వం ముందు ఉంచితే ప్రభుత్వం ఒప్పుకోని కారణంగా ఉద్యమం మొదలు పెడితే అది తీవ్ర రూపం దాల్చి ఆఖరికి బ్రిటిష్ ప్రభుత్వం దిగివచ్చి 1889 లో ఆదివారం సెలవు ప్రకటించింది, ఆదివారం సెలవుతో పాటు కార్మికులకి మధ్యాహ్నం పూట ఒక అరగంట విశాంత్రి సమయం ఇవ్వాలని, జీతాలు నెల 15 తేదీనే ఇవ్వాలని పోరాటం చేసి విజయం సాధించారు, భారత దేశంలో కార్మిక ఉద్యమాలకి పితామహుడిగా “నారాయణ మేఘాజి లోఖండే” గారిని చెప్పుకుంటారు.నారాయణ మేఘాజి లోఖండే గారి పేరు మీద 2005 వ సంవత్సరంలో భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ ని విడుదల చేసింది. మనం ప్రతివారం హయిగా ఎంజాయ్ చేస్తున్న ఆదివారం వెనుక ఉన్న చరిత్ర..!

Must Read: ఒక్క లీటర్ పెట్రోల్ తో 410 కిలోమీటర్ల మైలేజి.

(Visited 7,402 times, 1 visits today)