Home / General / క్లాస్ లీడర్ కాలేదని తొమ్మిదో తరగతి విద్యార్ధి ఆత్మహత్య…!

క్లాస్ లీడర్ కాలేదని తొమ్మిదో తరగతి విద్యార్ధి ఆత్మహత్య…!

Author:

ఇంటర్నెట్ ప్రభావమో…? ఇంట్లో ఉండే వాళ్ళతో కొంత సమయం కేటాయించలేని పనుల ప్రభావమో..? తెలియదు కానీ గత కొన్నేళ్ల నుండి చాలామంది చిన్న చిన్న కారణాలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుని కుటుంబ సభ్యులకి కడుపుకోత మిగిలిస్తున్నారు. జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న అపజయాలను తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు, ప్రస్తుత జనరేషన్ లో చిన్నప్పటి నుండే ఫోన్, ఇంటర్నెట్ లకి అలవాటు అయ్యి తమ సమస్యలను ఇంట్లో వాళ్ళతో, దగ్గరి వాళ్ళతో పంచుకోకుండా ఆత్మహత్య మార్గాన్ని అనుసరిస్తున్నారు, ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది, స్కూల్ లో క్లాస్ లీడర్ కాలేదని ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

క్లాస్ లీడర్ కాలేదని తొమ్మిదో తరగతి విద్యార్ధి ఆత్మహత్య...!

తానే క్లాస్ లీడర్ కావాలని ప్రతి విద్యార్థికి బలమైన కోరిక ఉంటుంది. అందుకు విద్యార్థులందరూ పోటీ పడుతుంటారు. పోటీ పడిన ఓ విద్యార్థి.. క్లాస్ లీడర్‌గా ఎంపిక కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన బెంగళూరు రాజరాజేశ్వరీనగర్‌లోని ఐడియల్ హోమ్ టౌన్‌షిప్‌లో మంగళవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. బాల్దిన్ కో ఎడ్యుకేషన్ ఎక్స్‌టెన్షన్ హై స్కూల్‌లో ఆర్. ధృవ్‌రాజ్ అనే విద్యార్థి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. నెల రోజుల క్రితం క్లాస్ లీడర్లకు స్కూల్ యాజమాన్యం ఎన్నికలు నిర్వహించింది. తొమ్మిదో తరగతి నుంచి నలుగురు విద్యార్థులు పోటీ పడ్డారు. వీరిలో ఒకరు ధృవ్‌రాజ్. అయితే ధృవ్‌రాజ్ తాను గెలుస్తానన్న నమ్మకంతో ఉన్నాడు. ఇటీవల క్లాస్ లీడర్ల ఎంపిక జాబితాను స్కూల్ యాజమాన్యం జూన్ 10న విడుదల చేసింది. ఆ జాబితాలో ధృవ్‌రాజ్ పేరు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సాయంత్రం ఇంటికి చేరుకున్న ధృవ్‌రాజ్.. అదే రోజు రాత్రి తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

(Visited 1 times, 1 visits today)