Home / Inspiring Stories / హార్ట్ ఎటాక్ లను ముందే పసిగట్టే పరికరాన్ని కనుగొన్న 10 వ తరగతి విద్యార్థి.

హార్ట్ ఎటాక్ లను ముందే పసిగట్టే పరికరాన్ని కనుగొన్న 10 వ తరగతి విద్యార్థి.

Author:

మారుతున్న కాలంతో పాటు కొత్త కొత్త రోగాలు ప్రజలను పీడించి చంపుతున్నాయి, అందులో ముందు వరుసలో ఉండేది గుండె సంబందిత వ్యాధులు. రక్త ప్రసరణ సరిగ్గా కాక గుండెపోటు(హార్ట్ ఎటాక్) తో చనిపోయిన వారు మనందరికి తెలిసిన వారిలో ఎవరో ఒకరు ఉంటారు. రోగికి తేరుకునే సమయం ఇవ్వకుండా సడెన్ గా వచ్చి ప్రాణాలు హరిస్తుంది ఈ నిశ్శబ్ద గుండెపోటు. చాలా ఆరోగ్యంగా ఉండే తన తాత ఒక్కసారిగా సైలెంట్ హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిపోవడాన్ని తట్టుకోలేక పోయాడు ఆకాశ్. తన తాతకు ఎందుకు ఇలా అయ్యిందో, ఇంతా సాంకేతికత అందుబాటులో ఉన్నా తన తాత హార్ట్ ఎటాక్ గురించి ముందే ఎందుకు తెలుసుకోలేకపోయాడో బాగా ఆలోచించి, వదలకుండా పరిశోధించి రెండు సంవత్సరాలలో సైలెంట్ హార్ట్ ఎటాక్ లను ముందే పసిగట్టే పరికరాన్ని కనుగొన్నాడు.

student-who-built-device-to-predict-silent-heart-attacks

ఇప్పుడు 10 వ తరగతి చదువుతున్న కర్ణాటక కు చెందిన ఆకాశ్, తన తాతకు హార్ట్ ఎటాక్ వచ్చిన తరువాత దాని గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాడు. చాలా పుస్తకాలు, మెడికల్ జర్నల్స్ చదివాడు మరియు మరింత సమాచారాన్ని ఇంటర్ నెట్ ద్వారా సంపాదించి సైలెంట్ హార్ట్ ఎటాక్ లకు మూల కారణాన్ని తెలుసుకొని దాన్ని ఏలా గుర్తించాలన్న విషయం మీదా రెండేళ్ళు పరిశోధన చేసాడు. అతని పరిశోధన ఫలించి జపాన్ లోని టోక్యో సైన్స్ యూనివర్సిటీ వారి నుండి పిలుపు అందింది వారి ఆర్ధిక సహకారంతో ఆకాశ్ సైలెంట్ హార్ట్ ఎటాక్ లను ముందే గుర్తించి రోగి ని హెచ్చరించే సిలికాన్ పాచ్ ని కనుగోన్నాడు. రోగి చెవి లేదా మణికట్టు వెనుక భాగంలో అమర్చే ఈ పాచ్ ఆ రోగి కి హార్ట్ ఎటాక్ వచ్చే సూచనలు ఉంటే వెంటనే తెలుపుతుంది. రోజుకు రెండు సార్లు ఎవరి సహాయం లేకుండా ఈ పరికరాన్ని ఉపయోగించి రోగులు తమ రక్త ప్రసరణ గురించి తెలుసుకోవచ్చు. తన కృషిని దేశానికి అంకితం చేస్తూ తన పరికరాన్ని భారత ప్రభుత్వంతో కలిసి 900 రూపాయలకే అందరికి అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించాడు ఆకాశ్. చదివింది 10 వ తరగతి అయినా కోట్ల మంది హృద్రోగుల పాలిట దేవుడిలా మారాడు ఈ ఆకాశ్.

(Visited 13,169 times, 1 visits today)