Home / Videos / Video:స్కూల్ కి పది నిముషాలు లేట్ గా వచ్చాడని.. బాతులా నడిపించి..బలి తీసుకున్నారు.

Video:స్కూల్ కి పది నిముషాలు లేట్ గా వచ్చాడని.. బాతులా నడిపించి..బలి తీసుకున్నారు.

Author:

వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులని ఒత్తిడికి గురిచేసి బట్టి చదువులు చదివించే కార్పొరేట్ స్కూల్లలో విద్యార్థుల పై పనిష్మెంట్ లు హద్దులు దాటిపోయి విద్యార్థుల ప్రాణాల మీదకి వస్తున్నాయి, స్కూల్ కి పదినిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు స్కూల్ యాజమాన్యం పనిష్మెంట్ ఇచ్చి ఒక విద్యార్థి ప్రాణాలు తీసుకున్నారు, ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం రాజధాని చెన్నై నగరంలో జరిగింది, వివరాల్లోకి వెళితే.. చెన్నై సిటీ తిరువికానగర్ లో ఓ కార్పొరేట్ స్కూల్ ఉంది. ఎం.నరేందర్ (15) అనే విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు. జనవరి 17వ తేదీ బుధవారం నాడు స్కూల్ కు ఉదయం 8.30కి హాజరవ్వాలి. అయితే పది నిముషాలు ఆలస్యంగా 8.40 కి వచ్చాడు. దీంతో స్కూల్ యాజమాన్యం ఆలస్యంగా వచ్చినవారందరిని స్కూల్ ఆవరణలో డక్ వాక్ చేయాలని ఆదేశించింది. నరేందర్ కూడా డక్ వాక్ చేశాడు. తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. అసలే 10వ తరగతి ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ఒత్తిడి.. దీనికితోడు లేటుగా వచ్చినందుకు డక్ వాక్ పనిష్మెంట్ తో టెన్షన్ పడ్డాడు నరేందర్. మధ్యలోనే సృహకోల్పోయాడు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి స్కూల్ యాజమాన్యం వాళ్ళు తరలించారు. జనవరి 18వ తేదీ గురువారం రాత్రి నరేందర్ చనిపోయాడు.

నరేందర్ తల్లితండ్రుల నుండి కంప్లయింట్ తీసుకున్న పోలీసులు స్కూల్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి డక్ వాక్ చేయించిన విషయం నిజమే అని నిర్థారించారు. మోకాళ్లపై నడిపించడం వల్లే నరేందర్ చనిపోయాడని.. తల్లిదండ్రులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల ఆందోళనకు విద్యార్థి సంఘాలు మద్దతు ఇచ్చారు. కార్పొరేట్ స్కూల్స్ అరాచకంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. పనిష్మెంట్ అంటే తప్పు తెలుసుకునేలా ఉండాలని విద్యార్థుల ప్రాణాలు తీసేలా ఉండకూడదని విద్యార్ధి సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి.

(Visited 331 times, 1 visits today)