Home / General / చిన్నారి ప్రాణాలు కాపాడిన రియల్ హీరో

చిన్నారి ప్రాణాలు కాపాడిన రియల్ హీరో

Author:

అభం శుభం తెలీని ఒక చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టాడు ఆ ట్రాఫిక్ పోలీస్. తన ప్రాణాలకు తెగించి మరీ ఆ పాపను కాపాడాడు. అసలే ట్రాఫిక్ తో ఉన్నరోడ్డు పైకి సడన్ గా ఒక చిన్నారి పాప పరుగేట్టుకుంటూ రావడం కనబడింది. అంతే పాపని కాపాడేందుకు ఆ పోలిస్ ముందు వెనకా ఆలోచించలేదు. ఎదురుగా వేగంగా వస్తోన్న వాహనాలనూ లెక్కచేయలేదు. రోడ్డుకు అడ్డంగా పరిగెత్తాడు..పాపను ప్రమాదం నుంచి కాపాడి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఈ ప్రమాదకర సంఘటన చైనాలోని గుయ్జోవ్ లో చోటుచేసుకుంది.

Traffic policeman in China's Guizhou

అసలేం జరిగిందంటే, ఓ మహిళ తన చిన్నారితో కలిసి స్కూటర్ మీద వెళుతోంది. రోడ్డు కూడలి వద్ద బండి ఆగడంతో చిన్నారి స్కూటర్ దిగి రోడ్డుపై పరుగులు తీయడం ప్రారంభించింది. తల్లి వారిన్చేలోగే రోడ్డు మెడకు పరిగెత్తింది పాప. అసలే రద్దీగా ఉన్న రోడ్డు. ఎదురుగా వస్తున్నా వాహనాలు రాకపోకలను గమనించకుండా పరిగేడుతున్న ఆ చిన్నారిని అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ చూశాడు. అదే సమయంలో అటుగా అనేక వాహనాలు వేగంగా వస్తున్నాయి. ముఖ్యంగా పాపని కాపాడే సమయంలో ఆల్మోస్ట్ ఓ కారు పోలీసుని డీ కొట్టేసిందేమో అనుకున్నారు..కానీ చాకచక్యంగా కారుని దాటి, తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఆ పాపని రక్షించాడు. ఏ మాత్రం ఆలస్యమైనా పాప ప్రాణాలతో పాటూ పొలిసు ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. అయితే  అలాంటిదేమీ జరగకపోవడంతో అక్కడే ఆగి చూస్తున్నవారoదరూ వూపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ సంఘటను, దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలను చైనా స్థానిక పత్రిక పీపుల్స్ డెయిల’ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ వార్త కాస్తా విపరీతంగా వైరల్ అయింది. ప్రాణాలకు తెగించి చిన్నారిని కాపాడిన  ట్రాఫిక్ పోలీస్ ని రియల్ హీరో అంటూ నెటిజన్లు ప్రశంసాపూరక కామెంట్లతో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. పాప ప్రాణాలని కాపాడిన ట్రాఫిక్ పోలీస్ ధైర్యానికీ, మానవత్వానికీ ప్రపంచమంతా

హాట్స్ ఆఫ్ చేవుతోంది.

WATCH: Traffic policeman in China’s Guizhou jumps into action to save child who suddenly jumps off a scooter and runs across the busy road pic.twitter.com/gwRasWtyPq

– People’s Daily,China (@PDChina) June 22, 2017

(Visited 1 times, 1 visits today)