సుకుమార్ దర్శకత్వం లో ఎన్టీఆర్ హీరో గా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఒక్క టైటిల్ విషయంలోనే రక రకాలు గా న్యూస్ లు వచ్చాయి. టెంపర్ సినిమాలో పేలిన పంచ్ డైలాగ్ “దండయాత్ర” అని మొదట్లో వార్తలొచ్చినా తర్వాత నాన్నకు ప్రేమతో అనీ తరవాత “న” సెటిమెంత్ తో ముందుకు “మా” అనే అక్షరం చేర్చి మానాన్నకు ప్రేమతో అనుకుంటున్నారనీ.. ఆ తర్వాత అభిరామ్ అనే టైటిల్ నీ పరిశీలిస్తున్నారు అంటూ ఎన్నో టైటిల్స్ వినిపించాయి.. కానీ మొత్తానికి నాన్నకు ప్రేమతో అనే టైటిల్నే ఫైనలైజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఐతే ఈ సినిమాకు సంబంధించి మరో షాకింగ్ న్యూస్ ఈ రోజునే బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఒకటి కాదట డబల్ రోల్ లో కనిపిస్తాడట ఎన్టీఆర్. ఇదివరలో “అదుర్స్” ఆంధ్రవాలాల కోసం ద్విపాత్రాభినయం చేసిన యంగ్ టైగర్ రెండోసారి ఇద్దరుగా కనిపించబోతున్నట్తు తెలుస్తోంది. ఫస్ట్ రోల్ మొత్తం ఇంటర్ పోల్ ఆఫీసర్ గా చాలా స్టయిలిష్ గా ఉంటాడట. ఇప్పటికే ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ తో ఉన్న స్టిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ఇప్పుడు తాజాగా రిలీజ్ చేయబోయే రెండో క్యారెక్టర్ లుక్ రఫ్‌గా ఉంటుందని పక్కా మాస్ లుక్ లో ఎన్టీఆర్ కనిపిస్తాడనీ తెలుస్తోంది. ఈ నెల 17 న వినాయకచవితిని పురస్కరించుకుని సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ ఇప్పటికే ఆంధ్రావాలా, అదుర్స్ సినిమాల్లో డబుల్ రోల్‌లో నటించాడు. ఈ సినిమాలో కూడా డబుల్ రోల్ చేస్తే ఏ రేంజ్‌లో విశ్వరూపం చూపుతాడో చూడాలి.