Home / Entertainment / కొత్త కాన్సెప్ట్ తో ముందుకొచ్చిన “సుమంత్” కి “సుబ్రమణ్యపురం” హిట్ అందించిందా.? స్టోరీ అండ్ రివ్యూ!!

కొత్త కాన్సెప్ట్ తో ముందుకొచ్చిన “సుమంత్” కి “సుబ్రమణ్యపురం” హిట్ అందించిందా.? స్టోరీ అండ్ రివ్యూ!!

Author:

ఒకప్పుడు యావరేజ్ హిట్ లు అందుకున్న సుమంత్ తర్వాత వరస ప్లాపులు ఎదురుకున్నాడు. ఇటీవలే మళ్లిరావతో కొద్దిగా పర్వాలేదు అనిపించారు. ఇప్పుడు సుభ్రమణ్యపురంతో మరోసారి మనముందుకు వచ్చారు. అలాగే ఈషా రెబ్బ కూడా హిట్ కోసం ఎదురు చేస్తున్న తరుణంలో ఈ సినిమా ఏమైనా ప్లస్ అయ్యిందా.? సుబ్రమణ్యపురం కథ ఏంటి.? రివ్యూ మీరే చూడండి!

కథ:

సుబ్రమణ్యపురం అనే గ్రామంలో ఊహించని విధంగా మనుషులు చనిపోతూ ఉంటారు .ఆ సమయంలో ఆ ఊరికి ఓ రీసెర్చ్ చేయడానికి సుమంత్ వస్తాడు. ఈ ఆత్మహత్యల వెనకాల గల కారణాల్ని కనిపెట్టాలి అనుకుంటాడు. సుబ్రమణ్యపురం లో మనుషులు ఎందుకు చస్తున్నారో తెలుసుకున్నాడా ? లేదా ? దేవుని పై పోరాటం చేసిన ఈ మానవుడు ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

అలజడి విశ్లేషణ:

సుమంత్ కు మళ్ళీ నటుడిగా సత్తా చాటే గొప్ప అవకాశం లభించింది . తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు సుమంత్ . తన నటనతో ఆకట్టుకున్నాడు. కానీ ఈషా రెబ్బ పాత్ర అంతగా ఆకట్టుకోలేదు. .సైన్స్‌కి అంద‌ని ఎన్నో ర‌హాస్యాలు మాన‌వ మేథ‌స్సుకు స‌వాళ్ళు విసురుతూనే ఉంటాయి. భ‌గ‌వంతుని మీద న‌మ్మ‌కం కూడా అలాంటిదే, ఆ న‌మ్మ‌కాన్ని ప్ర‌శ్నించే కార్తిక్ ప‌రిశోధ‌న‌లు ఎలాంటి నిజాల‌ను వెలుగులోకి తెచ్చాయి..? కాపాడ‌వ‌లసిన భ‌గ‌వంతుడి ఆగ్ర‌హం త‌ట్టుకోవ‌డం సాధ్యం అవుతుందా అనే ప్ర‌శ్న‌లకు స‌మాధానం ఈ సినిమా.చాలా వరకు సినిమా ఓపికకి పరీక్షపెడుతుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా పర్లేదు.విలేజ్ నేటివిటీతో సినిమా ముందుకి వెళ్లడం కమర్షియల్ సినిమాలు నచ్చేవారికి అంతగా ఆకట్టుకోదు.

శేఖర్ చంద్ర ఈ చిత్రానికి అందించిన నేపథ్య సంగీతం హైలెట్ గా నిలిచింది. కానీ పాటలు మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఎడిటింగ్ లో ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది . ప్రొడక్షన్ విలువలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి.ఈ సినిమా చూస్తున్నంత సేపు కార్తికేయ సినిమా గుర్తుకు వస్తూనే ఉంటుంది .

ప్లస్ పాయింట్స్ :

  • సుమంత్ నటన
  • ట్విస్ట్
  • సెకండ్ హాఫ్

మైనస్ పాయింట్స్ :

  • బోరింగ్ సన్నివేశాలు
  • ప్రొడక్షన్ వాల్యూస్
  • ఎడిటింగ్
  • సాంగ్స్

పంచ్ లైన్:  ఓపికకి పరీక్ష పెట్టే సినిమా “సుబ్రమణ్యపురం”.

రేటింగ్ :  2.25/5

గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

‘సుబ్రమణ్యపురం’ మూవీపై మీ అభిప్రాయం చెప్పండి  ?

(Visited 1 times, 1 visits today)