Home / Devotional / కార్తీక పౌర్ణమి(Nov 14) రోజు ఆకాశంలో అద్భుతం జరగబోతుంది.

కార్తీక పౌర్ణమి(Nov 14) రోజు ఆకాశంలో అద్భుతం జరగబోతుంది.

Author:

ఆకాశంలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. ఖగోళ చరిత్రలో గత 68 సంవత్సరాలలో జరగని… మరో 18 సంవత్సరాల వరకు జరగని అద్భుతం ఈ నెల 14 వ తేదీన జరుగనుంది. ఆ దృశ్యమే “సూపర్ మూన్”. రోజు కనిపించే చందమామ ఆ రోజు చాలా పెద్దగా కనిపించనున్నాడు. మాములు రోజుల్లో కనిపించేదాని కంటే 14% ఎక్కువగా కనిపించి అందరిని అలరించనున్నాడు.ఆ రోజు భూమికి చంద్రుడు అతి దగ్గర వస్తున్నాడు. నవంబర్ 14 న సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు ఈ అరుదైన సంఘటన ఆకాశంలో కనిపించడం మొదలవుతుంది. పెద్దగా మాత్రమే కాదు ఆ రోజు 30% ఎక్కువగా చందమామ ప్రకాశించనున్నాడు.

super-moon

ఇలాంటి అరుదైన సంఘటన 1948 లో ఒకసారి జరిగింది. ఆ తరవాత ఇప్పుడే జరుగనున్నది. మళ్ళీ ఈ అరుదైన చూడాలి అంటే 2030 వరకు ఆగాల్సిందే. నవంబర్ 14 న పౌర్ణమి కావడం అదే రోజు చిల్డ్రన్స్ డే కూడా కావడం చాలా ప్రత్యేకత సంతరించుకొని పిల్లలకు ఆ రోజు చందమామ గిఫ్ట్ గా పెద్దగా కనిపించనున్నాడు. చంద్రుడు భూమికి దగ్గర రావడం వలనే వాటి ఆమధ్య దూరం బాగా తగ్గిపోయి ‘సూపర్ మూన్’ గా ఏర్పాడుతుంది.

Also Read:  రావణుడు చనిపోతూ లక్ష్మణుడి చెవిలో చెప్పిన రహస్యాలు ఇవే…..!

(Visited 10,132 times, 1 visits today)