Home / Inspiring Stories / కాలుష్య ప్రమాణాలు పాటించని వాహానాలు ఏప్రిల్ 1 నుండి అమ్మకూడదు: సుప్రీం కోర్టు.

కాలుష్య ప్రమాణాలు పాటించని వాహానాలు ఏప్రిల్ 1 నుండి అమ్మకూడదు: సుప్రీం కోర్టు.

Author:

వాహన కంపనీలకు దిమ్మ తిరిగే నిర్ణయం ప్రకటించింది సుప్రీం కోర్టు, గాలి కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలకు ఏప్రిల్ 1 తరువాత రిజిస్ట్రేషన్ చేయొద్దని తెలిపింది. వాతవరణ కాలుష్యాన్ని తగ్గించడానికి అన్ని వాహానాలు బీఎస్-4 ప్రమాణాలు పాటించాలని సుప్రీం కోర్టు ఇంతకుముందే అన్ని వాహన కంపనీలకు నోటీసులు ఇచ్చింది అంతే కాకుండా పాత ప్రమాణాలు పాటించి తయారు చేసిన వాహనాలను ఏప్రిల్ 1 లోగా అమ్ముకోవాలని నోటీసులలో తెలిపింది కాని అవి పట్టించుకోకుండా అన్ని వాహన కంపనీలు లక్షలలో కాలుష్యాన్ని కలిగించే వాహానాలను తయారుచేసాయి. దీనిపై కన్నెర్ర చేసిన సుప్రీం కోర్టు ప్రజల ప్రాణాల కన్న తమకు ఏది ఎక్కువ కాదని ముందు ప్రకటించిన విధంగానే అన్ని బీఎస్ 3 ప్రామాణాలు ఉన్న వాహానాలు ఏప్రిల్ 1 లోగా అమ్ముకోవాలని లేదంటే వాటిని తుక్కుగా మార్చాల్సి వస్తుందని ప్రకటించింది.

supreme court order

దీనిపై వాహన కంపనీల అసోసియేషన్ వాదన మరోలా ఉంది, ఇప్పటికి బీఎస్ 3 ప్రమాణాలు ఉన్న 7,36,000 కొత్త వాహానాలు తమ గ్యారేజీలలో ఉన్నాయని అవి అమ్ముకోవడానికి ఇంకో 8 నెలల సమయం ఇవ్వాలని లేదంటే తమకు తక్కువలో తక్కువ 20,000 కోట్ల నష్టం వాటిల్లుతుందని ప్రకటించింది. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు అన్ని కంపనీలకు ఈ విషయం ముందే తెలుసని వారే తమ నోటీసులని పట్టించుకోకుండా అడ్డగోలుగా వాహానాలను తయారు చేసారని ఎట్టి పరిస్తితులలో ఏప్రిల్ 1 తరువాత బీఎస్ 4 ప్రమాణాలు పాటించని వాహానాలను ఎవరైనా అమ్మితే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని, బీఎస్ 3 వాహానాలకు రిజిస్ట్రేషన్ చేయమని ప్రకటించింది. ఒకవేళా ఆ వాహనం మార్చి 31 కు ముందు కొన్నట్లు రుజువు చూపితే అప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు.

(Visited 4,492 times, 1 visits today)