Home / Inspiring Stories / వాట్సాప్ ని మన దేశంలో బ్యాన్ చేస్తారా?

వాట్సాప్ ని మన దేశంలో బ్యాన్ చేస్తారా?

Author:

ఒక నాణెనికి రెండు వైపులు ఉన్నట్లే టెక్నాలజీతో కూడా ఉపయోగాలు మరియు నష్టాలు ఉంటాయి. మనదేశంలో స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారిలో 90% మందికి పైగా వాట్సాప్ అప్లికేషన్ వాడుతున్నారు. వాట్సాప్ ఉపయోగాల గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ ఉపయోగాల వలనే మన దేశ భద్రత కి ముప్పు ఉందని అందుకే వాట్సాప్ ని భారతదేశం నుండి బ్యాన్ చేయాలని హర్యానాకు చెందిన సుధీర్ యాదవ్ సుప్రీం కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. ఈ కేసును సుప్రీం కోర్టు వచ్చే బుధవారం విచారించనుంది.

Whatsapp banned in India

అసలు విషయానికొస్తే గత ఏప్రిల్ నుండి వాట్సాప్, తమ వినియోగదారుల మెసేజ్ లను  256 బిట్ ఎన్క్రిప్షన్ తో పంపుతుంది. ఈ విదానం ద్వారా ఒకసారి ఎన్క్రిప్ట్ అయిన మెసేజ్ లను ఎవరికి పంపారో వారు తప్ప ఇంకెవరు డీక్రిప్ట్ చేయలేరు మరియు హ్యాక్ చేసి చదవలేరు. వాట్సాప్ వారు కూడా ఆ మెసేజ్ లను చదువలేరు. ఇదిగో ఇక్కడే వచ్చింది అసలు చిక్కు, ఈ విధానం వలన సంఘవిద్రోహ శక్తులు తమ తమ ప్లాన్లను నిఘా సంస్థలకు తెలియకుండా వాట్సాప్ లో పంపించుకునే అవకాశం ఉందని, ఒకవేళ తీవ్రవాదులు వాట్సాప్ వాడుతున్నారని తెలిసినా మన పోలీసులు ఏమీ చేయలేరని, దీని వల్ల దేశ భద్రతకు భారీ ముప్పు పొంచి ఉన్నదని సుధీర్ యాదవ్ వాదన.

దీని గురించి సుధీర్ భారతీయ టెలికామ్ అథారిటీ కి ఐటి అండ్ సెక్యూరిటీ మినిస్ట్రీకి పలు ఉత్తరాలు వ్రాశాడు కానీ వారి నుంచి ఎటువంటి జవాబు రాకపోవడంతో సుప్రీం కోర్టులో పిల్ ( పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్) వేశారు దీనిని  సుప్రీం ధర్మాసనం బుధవారం విచారించనుంది. సుధీర్ వాదనలో నిజం ఉంది కానీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో చాలా మంది తన గోప్యత గురించి ఎక్కువ శ్రద్ద చూపుతున్నారు దానికి తగ్గట్లే అన్ని సాఫ్ట్‌వేర్ లు  తమ సెక్యూరిటీని పెంచుకుంటూ పోతున్నాయి. దీనివలన సుధీర్ వేసిన పిల్ పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి బుధవారం వాట్సాప్ పై సుప్రీం కోర్టు ఎం నిర్ణయం తీసుకుంటుందో?

MUST READ: రాత్రి ఇంట్లో లైట్ ఆఫ్ చేసాక చీకట్లో స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా?

(Visited 752 times, 1 visits today)