ఇష్టపూర్వక శృంగారాన్ని నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమని వెల్లడించింది. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 497 పురాతన చట్టమని.. రాజ్యాంగ సమ్మతమైనది కాదని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. సెక్షన్ 497 కాలం చెల్లిన చట్టంగా పేర్కొంది. మహిళలకు సమానహక్కులు కల్పించాలన్న స్ఫూర్తికి సెక్షన్ 497తో తూట్లు పడుతున్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది.
మహిళల సమానత్వానికి అడ్డుపడే ఏ నిబంధన అయినా రాజ్యాంగపరమైనది కాదని వ్యాఖ్యానించింది. వివాహమైతే పురుషులు భార్యలను తమ ఆస్తిగా భావిస్తున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే వివాహేతర సంబంధాల కారణంతో విడాకులు తీసుకోవచ్చని, దాన్ని నేరంగా పరిగణించలేమని కోర్టు స్పష్టంచేసింది.
అడల్ట్రీ చట్టం ఏకపక్షంగా ఉందంటూ IPC సెక్షన్ 497 ను ఛాలెంజ్ చేస్తూ కేరళకు చెందిన జోసెఫ్ షైన్ అనే వ్యాపారవేత్త సుప్రీంకోర్టులో 2017 లో పిల్ వేశాడు. దీన్ని వాచారించిన ఐదుగురు సభ్యుల ధర్మాసం అడల్ట్రీ చట్టం రాజ్యాంగ విరుద్దంగా ఉందని, అడల్ట్రీ చట్టాన్ని రద్దు చేస్తూ చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది.