Home / Entertainment / Video : ఫ్యాన్స్ కాళ్లు మొక్కిన హీరో సూర్య.

Video : ఫ్యాన్స్ కాళ్లు మొక్కిన హీరో సూర్య.

Author:

హీరోల కాళ్లు మొక్కే ఫ్యాన్స్ ను చూశాం.. అభిమానులను చీదరించుకునే హీరోలను ఇప్పటి వరకు చూశాం.. వీళ్లందరికీ ఇది డిఫరెంట్. అభిమానుల కాళ్లే హీరో మొక్కితే.. అవాక్కు అవ్వొద్దు. ఇది నిజమే. తమిళ హీరో సూర్య ఈ పని చేశాడు. ఫ్యాన్స్ కాళ్లు మొక్కాడు. ఏదో సరదాకి కాదు.. నిజంగా. మనస్ఫూర్తిగా చేశాడు. వేలాది మంది ఫ్యాన్స్ ముందు.. ఆడియో ఫంక్షన్ లోని వేదికపైనే ఈ పని చేశాడు. తమిళనాట పెద్ద సంచలనంగా మారింది ఈ వార్త.

హీరో సూర్య నటించిన సినిమా గ్యాంగ్. చెన్నైలో జనవరి 10వ తేదీ బుధవారం రాత్రి గ్యాంగ్ మూవీ ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. స్పీచ్ లు అయిపోయిన తర్వాత కొందరు ఫ్యాన్స్ వేదికపైకి వచ్చారు. వస్తూనే హీరో కాళ్లు పట్టుకున్నారు. ఇది రొటీన్ గా తీసుకోకుండా.. వారించలేదు హీరో సూర్య. తను కూడా అభిమానుల కాళ్లు పట్టుకున్నారు. షాక్ అయ్యారు ఫ్యాన్స్. మీరు నా కాళ్లు పట్టుకుంటే.. నేను కూడా మీ కాళ్లు పట్టుకుంటా అని గర్వంగా ప్రకటించాడు హీరో. అంతే కాదు ఇలా చేయడం తప్పని అభిమానులకు చెప్పాడు. వేదికపైనే కొద్దిసేపు వారితో కలిసి స్టెప్పులు వేశాడు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా 12వ తేదీన విడుదల అవుతుంది.

(Visited 479 times, 1 visits today)