ఆరోగ్యానికి సంబంధించి మనం ఎప్పటికప్పుడు పలు కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూనే ఉంటాం. నేటి తరుణంలో మనకు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలే కాదు, పోషకాలు, వ్యాధులు, వివిధ రకాల వైద్య విధానాలు, ఔషధాలను మనం చిటికెలో తెలుసుకుంటున్నాం. చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్లే మనకు ఆ విజ్ఞానాన్ని అందించేందుకు ఉపయోగపడుతున్నాయి. అయితే మన ఆరోగ్యం విషయానికి వస్తే నిజానికి కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రం ఈ టెక్నాలజీతో తెలియవు. వాటిని వైద్యులే మనకు చెప్పాల్సి ఉంటుంది. మరి మనకు వైద్యులు చెబుతున్న మన ఆరోగ్యానికి సంబంధించిన ఆ ముఖ్యమైన విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. మనం చెవిలో ఉండే గులిమి తీయడం కోసం చెవిలో ఇయర్ బడ్స్ లోపలి వరకు పోనిచ్చి తిప్పుతాం కదా. అయితే దీంతో ప్రమాదమేనట. ఇలా చేయడం వల్ల హార్ట్ ఎటాక్‌లు వచ్చేందుకు అవకాశం ఉంటుందట. ఎలా అంటే.. చెవిలో ఇయర్ బడ్స్ పెట్టి తిప్పినప్పుడు అందులో ఉండే ఓ ప్రత్యేకమైన నాడి వల్ల Vagal stimulation జరిగి అక్కడి నుంచి ఎలక్ట్రిక్ షాక్ గుండెకు చేరుతుందట. దీంతో హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ ఎటాక్‌లు వచ్చేందుకు అవకాశం ఉంటుందట.
2. ఇప్పుడీ విషయం తెలిస్తే నిజంగానే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే… మన నిత్యం మలాన్ని విసర్జించే గుద ద్వారం కన్నా మన నోట్లోనే ఎక్కువ బాక్టీరియా, వైరస్‌లు ఉంటాయట తెలుసా..? అవును, ఇది నిజమే. సాక్షాత్తూ వైద్యులే ఈ విషయాన్ని చెబుతున్నారు.
3. గుండె ఆగితే చనిపోతారని మనం ఇప్పటి వరకు తెలుసుకుంటూ వచ్చాం కదా. అయితే ఇది నిజం కాదు. ఎందుకంటే గుండె ఆగినా పలు ప్రత్యేకమైన ట్రీట్‌మెంట్స్ ఇస్తే వెంటనే బతుకుతారట. పైన చిత్రంలో ఇచ్చిన మహిళకు 20 నిమిషాల పాటు గుండె పనిచేయలేదట. దీంతో ఆమెకు వైద్యులు ఐసీయూలో ట్రీట్‌మెంట్ ఇచ్చారు. 20 నిమిషాల తర్వాత ఈ మహిళ వెంటనే లేచి కూర్చుని నవ్వుతూ ఇంటికి వెళ్లిపోయిందట. అయితే ఆ సమయంలో ఆమెకు నిద్ర పోయినట్టు అనిపించిందట.
4. మన నిత్యం తినే అనేక రకాల ఆహార పదార్థాల్లో మన శరీరానికి కావల్సిన కీలక విటమిన్లు, మినరల్స్ ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే దాదాపుగా అన్ని విటమిన్లు, మినరల్స్ వెజ్ ఆహారాల్లో ఉంటాయి కానీ.. కేవలం విటమిన్ బి12 మాత్రం కేవలం జంతు సంబంధ పదార్థాల్లో మాత్రమే మనకు లభిస్తుందట. కనుక వెజ్ ప్రియులు ఈ అంశం పట్ల చింతించాల్సిందే మరి..! ఏంటీ.. విటమిన్ బి12 ఒక్కటి దొరక్కపోతే ఏం.. అని సులభంగా తీసేయవద్దు. ఎందుకంటే ఈ విటమిన్ లోపించడం వల్ల మెదడు సరిగ్గా ఎదగదట. జ్ఞాపకశక్తి మందగిస్తుందట. దీనికి తోడు హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.
5. విటమిన్ ఎ మనకు చాలా అవసరమని అందరికీ తెలిసిందే. దీని వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ మెరుగు పడడమే కాదు, నేత్ర సమస్యలు పోయి దృష్టి బాగా వస్తుంది. అయితే నిజానికి ఈ విటమిన్ ఉన్న పదార్థాలను అధిక మోతాదులో తీసుకోకూడదట. తీసుకుంటే శరీరంలో మొత్తం విషతుల్యం అయి చివరకు చనిపోతారట. ఉత్తర ధృవంలో ఉండే పౌరులు అక్కడ లభించే ఎలుగుబంటి లివర్‌ను తినేవారట. అందులో విటమిన్ ఎ అధిక మోతాదులో ఉండడం వల్ల వారి శరీరాలు విషతుల్యం అయి చనిపోతున్నారట. కనుక అతి సర్వత్ర వర్జయేత్ అనే నియమాన్ని పాటించాలి. అంటే… ఏదీ ఎక్కువగా, అతిగా తినకూడదు. తింటే ఇలాగే అవుతుంది.
6. ఆయిల్ ఉన్న ఆహారాలను ఎక్కువగా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి తద్వారా గుండె ఆరోగ్యం దెబ్బ తింటుందని, గుండె జబ్బులు వస్తాయని మనం ఇప్పటి వరకు చదివాం కదా. అయితే ఇది నిజం కాదట. నిజానికి రిఫైన్డ్ పిండి, చక్కెర, ఉప్పు వంటివి ఎక్కువగా తింటేనే గుండె జబ్బులు వస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. పైగా ఆయిల్ ఫుడ్స్‌ను తింటే ఎక్కువ సేపు ఆకలి వేయదని, తద్వారా ఇలాంటి రిఫైన్డ్ పిండి పదార్థాలను ఎక్కువగా తినకుండా జాగ్రత్త పడవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.