Home / Entertainment / మహేష్ బాబు, మురగదాస్ సినిమాలో విలన్ గా సూర్య…!

మహేష్ బాబు, మురగదాస్ సినిమాలో విలన్ గా సూర్య…!

Author:

శ్రీమంతుడు లాంటి సూపర్ హిట్ తరువాత మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం పై అభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు, కాని అది డిజాస్టర్ కావడంతో మహేష్ బాబు ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు, అందుకు తగ్గట్టుగానే కాంబినేషన్స్ ని సెట్ చేస్తున్నాడు ప్రిన్స్.

ప్రతిసారి కొత్త కథలతో, అదిరిపోయే స్క్రీన్ ప్లే తో సినిమాలు తీసే మురుగదాస్ తో తన నెక్స్ట్ సినిమా తీయబోతున్నాడు అని చాలా రోజుల కిందనే మనకు తెలుసు, కాని స్టార్ హీరోల సినిమాలు సెట్స్ మీదికి వెళ్లేముందే లెక్కలేనన్ని వార్తలొచ్చేస్తుంటాయి, ఇందులో ఏది నిజమో.. ఏది రూమరో కనుక్కోవడం కష్టం, మహేష్ బాబు చేయబోయే కొత్త సినిమా గురించి కూడా ఇప్పటికే బోలెడు కబుర్లు విన్నాం. ఆ కబుర్లలో కొన్నింటిని స్వయంగా దర్శకుడు మురుగదాసే ఖండించడంతో కొన్నాళ్లుగా జనాలు సైలెంటుగా ఉన్నారు. ఐతే ఈ మధ్యే ఈ సినిమాలో తమిళ దర్శకుడు-నటుడు ఎస్.జె.సూర్య విలన్ గా నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇది నిజమో కాదో అని మహేష్ అభిమానుల్లో డౌట్ ఉంది. స్వయంగా ఎస్.జె.సూర్యనే కన్ఫర్మేషన్ ఇచ్చేయడంతో సందేహాలు తొలగిపోయాయి.

Surya and Mahesh babu

ఇటీవలే ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ‘ఇరైవి’ అనే సినిమాలో కీలక పాత్రతో అదరగొట్టాడు ఎస్.జె.సూర్య. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి చెబుతూ మహేష్ సినిమాలో విలన్ గా చేయబోతున్నట్లు వెల్లడించాడు సూర్య. ఐతే ఈ సంగతి అఫీషియల్ గా మురుగదాస్.. నిర్మాతలే చెప్పనివ్వండి అన్నాడు సూర్య. ఇక పవన్ కళ్యాణ్ సినిమా గురించి ఈ ఇంటర్వ్యూలో కొన్ని కబుర్లు చెప్పాడు.

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సాగే ఫ్యాక్షన్ లవ్ స్టోరీతో ఈ కథ సాగుతుందని.. ఈ ప్రాంతం వ్యక్తిగా పవన్ నటిస్తుండటం ఇదే తొలిసారని.. సినిమా చాలా సరదాగా సాగుతుందని అన్నాడు సూర్య. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్ అని కూడా కన్ఫమ్ చేశాడు సూర్య. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తాను కథానాయకుడిగా నటిస్తున్న థ్రిల్లర్ మూవీ పూర్తయిందని.. ఇది తన యాక్టింగ్ కెరీర్లో మరో మైలురాయి అవుతుందని అతను చెప్పాడు.

(Visited 449 times, 1 visits today)