Home / General / రెండు వారాల్లోనే హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ…ఐదుగురు మృతి

రెండు వారాల్లోనే హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ…ఐదుగురు మృతి

Author:

ఈ వ్యాధితో బాధపడుతూ ఇప్పటి వరకే ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. నగరంలో స్వైన్ ఫ్లూ కేసులు పెరిగిపోతున్నాయని రాష్ట్ర వైద్యవృత్తి డైరెక్టర్ రమేష్ రెడ్డి తెలిపారు. నగరవాసులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్న ఇద్దరు ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో చేరారు. వారు చికిత్స పొందుతూ మృతి చెందారు. స్వైన్‌ ఫ్లూతో బాధపడుతున్న మరో ముగ్గురు గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. వారు కూడా చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను అలర్ట్ చేశాం. స్వైన్ ఫ్లూ కిట్లను పంపిణీ చేశామన్నారు డాక్టర్ రమేష్.స్వైన్ ఫ్లూ అనేది H-1 N-1 వైరస్. ఇది భారత్‌లో చాలా ప్రాంతాల్లో ఉంది.

swine flu kills 5 in hyderabad 2018

ఒక వ్యక్తికి హెచ్1 ఎన్ 1 వైరస్ సోకితే.. ఆ వ్యక్తి తుమ్మినా, ఆ వ్యక్తి వదిలిన గాలిని పీల్చనా పక్కనే ఉన్న వ్యక్తికి వ్యాపిస్తుంది. వైరల్ ఫీవర్, దగ్గు ,జలుబు, ఒళ్లు నొప్పులు వీటి లక్షణాలు. ఇది ఎక్కువగా చిన్నపిల్లలు, గర్భవతులు, వయస్సు మీద పడిన వారికి త్వరగా సోకే అవకాశాలున్నాయి. ఏమాత్రం అనుమానం వచ్చిన వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని … తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు.

(Visited 1 times, 1 visits today)