Home / Latest Alajadi / మీలో ఈ 7 ల‌క్షణాలున్నాయా…? అయితే జాగ్ర‌త్త మీకు డ‌యాబెటిస్ ఉందో లేదో చెక్ చేసుకోండి

మీలో ఈ 7 ల‌క్షణాలున్నాయా…? అయితే జాగ్ర‌త్త మీకు డ‌యాబెటిస్ ఉందో లేదో చెక్ చేసుకోండి

Author:

నేడు ప్రపంచం లో అందరిని కలవరపెడుతున్న వ్యాధులలో మధుమేహం (డయాబెటిస్) ఒకటి. ఒకప్పుడు మధ్యవయస్సులో వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు యుక్తవయస్సువారికి రావడం కాస్త కలవరపెడుతున్న విషయం. ఆహారపు అలవాట్లు, జీవన విధానం, ఊబకాయం వంటి అజాగ్ర‌త్త‌ల‌  వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. డయాబెటిస్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వంశపరపర్యగా వచ్చేది, రెండవది సరైన ఆహారపు అలవాట్లు తదితర అజాగ్ర‌త్త‌ల‌  వల్ల  వచ్చేది.  మన శరీరంలో వచ్చే కొన్ని లక్షణాలు వల్ల మనం టైపు 2 మధుమేహాన్ని గుర్తించవచ్చు.

బరువు తగ్గడం: డయాబెటిస్ లక్షణం ఉన్న‌వారు ఒక్కసారిగా శరీర బరువుని కోల్పోతారు. ఇది ఎలాంటి వ్యాయామం చెయ్యకపోయినా ఏడైటింగ్ చేయకపోయినా సంభవించవచ్చు.

weight-loss-300x199

అధిక దాహం, మూత్ర విసర్జన : డయాబెటిస్ ఉన్నవాళ్ళకి ఎక్కువగా మూత్రవిసర్జన అవుతూ ఉంటుంది. అదికూడా రాత్రి వేళ్ళల్లో ఎక్కువగాఅవుతుంది. దీనితోబాటు అధిక దాహం కూడా ఉంటుంది. రక్తం లో ఉన్న గ్లూకోజ్ బయటకు పంపేందుకు శరీరానికి నీటి అవసరం అవుతుంది అందువల్ల అధిక దాహం కలుగుతుంది. తాగిన నీరు గ్లూకోజ్ తో కలిసి ముత్రరూపంలో బ‌య‌ట‌కు పోతుంది. రోజుకు 10కన్నా ఎక్కువసార్లు ముత్ర విసర్జన చేస్తే డయాబెటిస్ వచ్చే అవ‌కాశం ఉందని గ్రహించాలి.

Polydipsia

అలసట : డయాబెటిస్ ఉన్నవ్వాళ్ళు ఎక్కువగా అలసిపోతుంటారు . ఏపని చేసిన వెంటనే అలసిపోవడం జరుగుతుంది. మత్తుగా ఉండటం ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తుంది.

9cb27908ad5aa21bb24cfc5953680868

అధిక ఆకలి : శరీరంలో తయారయ్యే ఇన్సులిన్ కణాలు మనం తినే తిండిని సరిగా గ్రహించలేవు. మనం తీసుకొనే ఆహారం గ్లూకోజ్ గా మారుతుంది. ఆ గ్లూకోజ్ ను ఇన్సులిన్స్ సరిగా గ్రహించకపోవడం వాళ్ళ మెదడుకు ఆహారం పంపమని సిగ్నల్ పంపుతుంది. అందుకే అధికంగా ఆహారం తీస్కోవలసి వస్తుంది.

Polyphagia

కాలి గాయాలు త్వరగా మానకపోవడం: కాలికి ఎదైనా దెబ్బ తగిలితే అది త్వరగా మానకపోతే అది డయాబెటిస్ లక్షణంగా గుర్తిన్చాలి. అశ్రద్ద చేస్తే ఆ గాయం మరింతముదిరి చివరకు ఆ అవయువాన్ని తొలగించే ప్రమాదం ఉంది. కనుక అలంటి సమస్య వచ్చినప్పుడు డాక్టర్ సలహా తీసుకోవడం ముఖ్యం.

diabetes_foot_problems_s3_vascular

దృష్టి : డయాబెటిస్ ఉన్నవారికి కొద్దిగా దృష్టి మందగిస్తుంది. మసకగా కనపడటం దూరంగా ఉండే వస్తువుల్ని గుర్తించలేకపోవడం వంటి లక్షణాలు ఉన్నవారు నిర్లక్షం చేయకుండా డాక్టర్ ని సంప్రదించడం ఉత్తమం.

diabetes-vision

స్పర్స లేకపోవడం : డయాబెటిస్ వాళ్ళ రక్త సరఫరా సరిగా లేకపోవడం వల్ల శరీరంలో ఉండే కణాలు శాశ్వతంగా దెబ్బతినే అవకాసం ఎక్కువ. దీనివల్ల మన శరీరంపైకొన్ని చోట్ల స్పర్స లేకోవడం, ఆ ప్రాంతం లో సూదులతో గుసిహ్నట్లు ఉండటం జరుగుతుంది.

download

తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

(Visited 1 times, 1 visits today)